Top Doctors Share These Tips: మీ కళ్లను బంగారంలా కాపాడుకోవడానికి టాప్ డాక్టర్ల చిట్కాలు ఇవే..

టాప్ డాక్టర్ల చిట్కాలు ఇవే..

Update: 2026-05-16 10:36 GMT

Top Doctors Share These Tips: వేసవి కాలం ముగిసి వర్షాలు మొదలవగానే గాలిలో పెరిగే తేమ, దుమ్ము, కలుషిత నీటి వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా విజృంభిస్తాయి. ఫలితంగా ఈ సీజన్‌లో కంటి ఇన్ఫెక్షన్ల ముప్పు విపరీతంగా పెరుగుతుంది. కొద్దిగా నిర్లక్ష్యం చేసినా చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వర్షాకాలంలో వేధించే ప్రధాన కంటి సమస్యలు:

ఈ రోజుల్లో ఎక్కువగా క్రింది సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి:

ఇది వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి.

కనురెప్పల వాపు:

కనురెప్పలపై మొటిమల్లా చిన్న చీము గడ్డలు ఏర్పడటం.

బ్లెఫరైటిస్: కనురెప్పల అంచులు ఎర్రబడి వాపు రావడం.

లక్షణాలు:

కళ్లు ఎర్రబడటం, నిరంతరం దురద, కళ్ల నుండి నీరు కారడం, పొడిబారడం మరియు తీవ్రమైన అసౌకర్యం.

కంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణకు సులభమైన మార్గాలు:

కంటి చూపును సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కీలక జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి..

1చేతుల శుభ్రత - కళ్లను రుద్దవద్దు: మురికి చేతులతో కళ్లను తాకడం వల్లే ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. కళ్లలో దురదగా అనిపించినా గట్టిగా రుద్దకూడదు.

స్వచ్ఛమైన నీటితో క్లీనింగ్:

పొరపాటున వర్షపు నీరు కళ్లలో పడితే, వెంటనే ఫిల్టర్ చేసిన శుభ్రమైన నీటితో కళ్లను వాష్ చేసుకోవాలి. నిలిచివున్న మురుగునీటి గుంటల్లో ముఖం కడగడం పూర్తిగా మానేయాలి.

వ్యక్తిగత వస్తువులు పంచుకోవద్దు:

మీ ముఖాన్ని తుడిచే టవల్స్, హ్యాండ్ కర్చీఫ్‌లు మీకే ప్రత్యేకంగా ఉండాలి. ఇతరుల ఐ-డ్రాప్స్, కాంటాక్ట్ లెన్స్ లేదా మేకప్ కిట్లను అస్సలు ఉపయోగించవద్దు.

ప్రయాణాల్లో రక్షణ కళ్లజోడు:

బయటకు వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్ లేదా ప్రొటెక్టివ్ గాగుల్స్ వాడటం వల్ల గాలిలోని ధూళి, అతినీలలోహిత కిరణాలు, వర్షపు చుక్కల నుండి కళ్లకు రక్షణ దొరుకుతుంది.

కాంటాక్ట్ లెన్స్‌లకు నో:

వర్షాకాలంలో వీలైనంత వరకు కాంటాక్ట్ లెన్స్‌ల వాడకాన్ని తగ్గించి, సాధారణ కళ్లజోళ్లను వాడటం ఉత్తమం. లెన్స్ వాడితే వాటిని అత్యంత పరిశుభ్రంగా ఉంచాలి.

పుష్కలంగా నీరు తాగాలి:

శరీరాన్ని

కంటి పొరలను హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ముఖ్యం. ఇది కంటి పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

ఇంటి పరిశుభ్రత:ఇంట్లో బూజు, తేమ పట్టకుండా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటే హానికరమైన ఫంగస్, సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంది.

సొంత వైద్యం వద్దు:

కళ్లలో ఎలాంటి సమస్య అనిపించినా మెడికల్ షాపుల్లో దొరికే డ్రాప్స్ వాడకుండా, వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. కంటి వాపు ఎక్కువగా ఉంటే, ఒక శుభ్రమైన గుడ్డను గోరువెచ్చని నీటిలో నానిపి కనురెప్పలపై 5-10 నిమిషాలు ఉంచడం ద్వారా తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News