Turmeric Milk: పాలలో కాస్త పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఇంకా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ పాలలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ ఉంటాయి. వాటికి పసుపు జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

గుండె ఆరోగ్యం: పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండెను కాపాడతాయి. పసుపు పాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

రోగనిరోధక శక్తి: పసుపు పాలలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జీర్ణ వ్యవస్థ: క్రమంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జలుబు: గోరువెచ్చని పసుపు పాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలతో జలుబు లాంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం ఇస్తాయి. కఫం తగ్గించడంలోనూ సహాయపడతాయి.

మంచి నిద్ర: రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగితే శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలు పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో గాఢ నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది.

పసుపు పాలు తయారీ: ఒక కప్పు పాలు తీసుకోండి. దాంట్లో పావు టీస్పూన్ పసుపు కలపండి. వేడి చేయండి. అంతే పసుపు పాలు రెడీ.

Tags: