Lose Weight and Get Glowing Skin: బరువు తగ్గాలా? చర్మం మెరవాలా? అయితే రోజూ ఉదయం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి..
అయితే రోజూ ఉదయం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగండి..
Lose Weight and Get Glowing Skin: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నేడు చాలామంది సహజ సిద్ధమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక హెల్త్ డ్రింక్ ఆరెంజ్ జింజర్ షాట్. నారింజ, అల్లం, క్యారెట్ కలయికతో తయారయ్యే ఈ జ్యూస్ కేవలం రుచికరమే కాదు, ఆరోగ్యానికి ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు.
ఎందుకు తాగాలి? దీని ప్రయోజనాలేంటి?
రోగనిరోధక శక్తి పెంపు: క్యారెట్లలో ఉండే బీటా-కెరోటిన్, నారింజలోని విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
జీర్ణక్రియ మెరుగు: అల్లంలోని 'జింజెరోల్' జీర్ణక్రియకు అద్భుతంగా తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గడానికి: ఈ షాట్ శరీరంలోని మెటబాలిజంను పెంచి, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.
మెరిసే చర్మం: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.
తయారు చేసే విధానం:
దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..
కావలసినవి: 2 మధ్యస్థ క్యారెట్లు, 1 నారింజ పండు, 1 అంగుళం అల్లం ముక్క.
విధానం: క్యారెట్ తొక్క తీసి ముక్కలుగా కోయాలి. వీటన్నింటినీ జ్యూసర్‌లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. వచ్చిన రసాన్ని వడకట్టి చిన్న సీసాలలో నింపుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో 1-2 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఎప్పుడు తాగాలి?
ఈ ఆరెంజ్ జింజర్ షాట్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.