Lower the Risk of Colon Cancer: పేగు క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? రోజూ మీ ఆహారంలో ఈ 5 వస్తువులు ఉండేలా చూసుకోండి..

ఈ 5 వస్తువులు ఉండేలా చూసుకోండి..

Update: 2026-06-23 06:55 GMT

Lower the Risk of Colon Cancer: మనం తినే ఆహారం మన జీర్ణవ్యవస్థపై, ముఖ్యంగా పెద్దపేగు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఫైబర్ తక్కువగా ఉండే జంక్ ఫుడ్స్, అతిగా ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీనికి భిన్నంగా, పేగులను శుభ్రంగా ఉంచి, క్యాన్సర్ కణాల ఉత్పత్తిని నిరోధించే 5 అద్భుతమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ధాన్యాలు

ఓట్స్, బ్రౌన్ రైస్, రాగులు, సజ్జలు మరియు జొన్నలు వంటి తృణధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పేగుల్లోని వ్యర్థాలను క్రమం తప్పకుండా బయటకు పంపడానికి సహాయపడుతుంది. తద్వారా పేగు గోడలు దెబ్బతినకుండా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

ఆకుకూరలు - క్యాబేజీ జాతి కూరగాయలు

తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు బ్రోకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్లను మీ డైట్‌లో చేర్చుకోండి. వీటిలో ఉండే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం శరీరంలోని క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తాజా పండ్లు - బెర్రీలు

యాపిల్స్, జామకాయలు, నారింజలతో పాటు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ వంటి పండ్లలో విటమిన్ సి, ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పెద్దపేగులో వాపులను తగ్గించి, కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.

బీన్స్ - పప్పుధాన్యాలు

చిక్కుడుకాయలు, బఠానీలు, శనగలు మరియు రాజ్మా వంటి పప్పుధాన్యాలు శరీరానికి కేవలం ప్రోటీన్లను మాత్రమే కాకుండా పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి జీర్ణకోశ ఆరోగ్యాన్ని కాపాడి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

పెరుగు లేదా మజ్జిగ

పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలలో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే గుడ్ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇవి పెద్దపేగులో రోగనిరోధక శక్తిని పెంచి, హానికరమైన టాక్సిన్లను అణచివేస్తాయి.

నిపుణు హెచ్చరిక

"ఆహారంతో పాటు రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగడం, శారీరక శ్రమ చేయడం ముఖ్యం. అలాగే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, రెడ్ మీట్ వాడకాన్ని తగ్గించడం వల్ల పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 50శాతం పైగా నివారించవచ్చు.

Tags:    

Similar News