Chandipura Virus: వర్షాకాలంలో చిన్న పిల్లలను ఎక్కువగా భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో చండీపుర వైరస్ (Chandipura Virus - CHPV) ఒకటి. ఇది ప్రధానంగా ఇసుక ఈగలు (Sandflies), దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లలపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు తీవ్ర అప్రమత్తత అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యమైన హెచ్చరిక, లక్షణాలు

చండీపుర వైరస్ సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ జ్వరంలా అనిపించినా, కేవలం 48 నుండి 72 గంటల్లోపే పరిస్థితి తీవ్రమవుతుంది. క్రింది లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు.

అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం (రాత్రి సమయాల్లో జ్వరం మరింత ఎక్కువగా ఉండటం).

తీవ్రమైన తలనొప్పి, విపరీతమైన నీరసం.వికారం , తరచుగా వాంతులు కావటం.

మూర్ఛలు,శరీరంలో వణుకు.

ప్రవర్తనలో మార్పులు, తీవ్రమైన చికాకు, గందరగోళం

స్పృహ కోల్పోవడం లేదా అసాధారణ మత్తుగా ఉండటం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పైన పేర్కొన్న లక్షణాలు కనిపించిన వెంటనే (వీలైతే 3 గంటల్లోపు) పిల్లలను ఆసుపత్రికి తరలించాలి. ఇది మెదడు వాపు వ్యాధి కి దారితీసి ప్రాణాంతకం కావచ్చు.

ప్రత్యేక మందులు లేవు

ఈ వైరస్‌కు నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కేవలం ఆసుపత్రిలో అందించే సపోర్టివ్ కేర్ (ICU,లక్షణాలను బట్టి చికిత్స) ద్వారా మాత్రమే ప్రాణాలు కాపాడగలరు.

ఇసుక, ఈగలు, సాధారణంగా బురద ఇళ్ల గోడల పగుళ్లలో, మురికివాడల్లో, పశువుల పాకల దగ్గర ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఇళ్లను, పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు పూర్తి శరీరంగ్‌ను కవర్ చేసే బట్టలు వేయడం, దోమలు, ఈగలు కుట్టకుండా రిపెల్లెంట్స్ వాడటం మంచిది.

Tags: