Eating at the Same Time Every Day: రోజూ ఓకే టైంకు తింటున్నారా.?
తింటున్నారా.?
Eating at the Same Time Every Day: ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో.. ఎప్పుడు తింటున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. చాలామంది ఆకలి వేసినప్పుడు లేదా సమయం దొరికినప్పుడు భోజనం చేస్తుంటారు. కానీ, రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని డైటీషియన్లు సూచిస్తున్నారు.
మన శరీరానికి ఒక 'బయోలాజికల్ క్లాక్' ఉంటుంది. మనం క్రమం తప్పకుండా ఒకే సమయానికి ఆహారం ఇవ్వడం అలవాటు చేస్తే, మన జీవక్రియ అంటే మెటబాలిజం గణనీయంగా మెరుగవుతుంది. అయితే, ఈ మార్పు రాత్రికి రాత్రే రాదు. మీరు క్రమం తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తే, సరిగ్గా 90 రోజుల తర్వాత మీ శరీరంలో స్పష్టమైన ఫలితాలను గమనించవచ్చు. శరీర యంత్రాంగం ఒక పద్ధతికి అలవాటు పడటానికి ఈ సమయం అవసరం.
సమయ పాలన పాటించడం వల్ల జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. సరైన సమయానికి ఎంజైములు విడుదలవ్వడం వల్ల మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై, అందులోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. ఆహారం ద్వారా అందే శక్తి కణాలకు సమర్థవంతంగా చేరుతుంది.
ఇక డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలన్నా, ఉన్నవారికి కంట్రోల్ అవ్వాలన్నా ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది. ఒకే సమయానికి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పడిపోవడం లేదా పెరగడం వంటివి జరగవు. దీనివల్ల రోజంతా అలసట లేకుండా, ఎనర్జీ లెవల్స్ మెరుగ్గా ఉండి మీరు చాలా యాక్టివ్‌గా పని చేయగలుగుతారు.