Dangerous Foods: ఆయుష్షును తగ్గించే డేంజర్ ఫుడ్స్: రోజూ ఇవి తింటున్నారా? అయితే జాగ్రత్త

అయితే జాగ్రత్త

Update: 2026-07-08 07:28 GMT

Dangerous Foods: మారిన జీవనశైలి, నోటికి రుచిగా అనిపించే జంక్ ఫుడ్స్ వల్ల చాలామంది తెలియకుండానే రోగాల బారిన పడుతున్నారు. మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీర అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తూ.. మన ఆయుష్షును గణనీయంగా తగ్గిస్తాయని తాజా హెల్త్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించాలంటే.. మన దైనందిన ఆహారంలో వెంటనే నివారించాల్సిన ఆ డేంజర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆయుష్షును హరించే 5 ప్రధాన ఆహారాలు..

ప్రాసెస్డ్ మీట్:

సాసేజ్‌లు, బేకన్, సలామీ వంటి నిల్వ ఉంచిన మాంస ఉత్పత్తుల్లో సోడియం, నైట్రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, పక్షవాతం ప్రేగు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదాన్ని భారీగా పెంచుతాయి.

మైదా, వైట్ బ్రెడ్:

మైదాతో చేసిన బ్రెడ్, పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లలో ఫైబర్ అస్సలు ఉండదు. ఇవి శరీరంలో చేరిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అకస్మాత్తుగా పెంచేస్తాయి. ఫలితంగా ఊబకాయం టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ & కూల్ డ్రింక్స్:

కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్‌లలో చక్కెర శాతంతో పాటు ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. ఇవి లివర్‌లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ఫ్యాటీ లివర్ సమస్యకు కారణమవుతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

డీప్ ఫ్రై చేసిన ఆహారాలు:

నూనెలో బాగా మగ్గిన, ఒకే నూనెను పదే పదే మరిగించి చేసే ఫ్రైడ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ పేరుకుపోతాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు వచ్చే రిస్క్‌ను పెంచుతాయి.

ప్యాక్ చేసిన చిప్స్, మిక్చర్స్:

ప్యాకెట్లలో దొరికే కుర్కురే, చిప్స్ వంటి స్నాక్స్‌లో రుచి కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం సోడియం విపరీతంగా కలుపుతారు. ఎక్కువ సోడియం శరీరంలోకి చేరితే బీపీ పెరిగి, కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News