Baby Oil: బేబీ ఆయిల్‌ను పెద్దవాళ్లు ఎలా వాడుకోవాలో తెలుసా?

తెలుసా?

Update: 2026-07-01 11:39 GMT

Baby Oil: కొన్ని చిట్కాలు వినడానికి చాలా సింపుల్ గా ఉంటాయి.. కానీ కరెక్ట్ టైంకి అవి అస్సలు గుర్తుకురావు. అలాంటి వాటిలో బేబీ ఆయిల్ వాడకం కూడా ఒకటి.పిల్లలు ఉన్న దాదాపు ప్రతి ఇంట్లోనూ బేబీ ఆయిల్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఆయిల్ ను కేవలం చిన్నపిల్లల కోసమే వాడతాం అనుకుంటే పొరపాటే! చిన్నపిల్లల చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి, వెదర్ మారినప్పుడు చర్మం పగలకుండా, రాషెస్ రాకుండా బేబీ ఆయిల్ ను మంచి మాయిశ్చరైజర్ లా వాడుతుంటారు.కానీ నిజానికి.. బేబీ ఆయిల్ చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా ఒక వండర్ లా పనిచేస్తుంది.

సాధారణంగా చర్మం పగలకుండా ఉండేందుకు మనం వ్యాజిలిన్ వాడుతుంటాం. ఒకవేళ ఇంట్లో సమయానికి వ్యాజిలిన్ లేకపోతే.. బేబీ ఆయిల్ ను హ్యాపీగా వాడొచ్చు. ఇది వ్యాజిలిన్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చాలామందికి పాదాలు పగిలి, చర్మం పెలుసుగా మారుతుంది. అలాంటప్పుడు మార్కెట్ లో దొరికే కాస్ట్లీ క్రాక్ క్రీమ్స్ కొనాల్సిన అవసరం లేకుండా.. రాత్రి పడుకునే ముందు పాదాలకు కొద్దిగా బేబీ ఆయిల్ రాసి చూడండి, కొద్ది రోజుల్లోనే మీ పాదాలు సాఫ్ట్ గా తయారవుతాయి.

ఇక బ్యూటీ కేర్ విషయానికి వస్తే.. మేకప్ వేసుకోవడానికి ఎంత ఖర్చు పెడతారో, దాన్ని క్లీన్ చేయడానికి మేకప్ రిమూవర్ కోసం కూడా అంతే ఖర్చు పెడుతుంటారు. కానీ మీ ఇంట్లో బేబీ ఆయిల్ ఉంటే.. రూపాయి ఖర్చు లేకుండా వాటర్ ప్రూఫ్ మేకప్ ను కూడా చాలా ఈజీగా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా రిమూవ్ చేసుకోవచ్చు. కాటన్ ప్యాడ్ పై కొన్ని చుక్కల బేబీ ఆయిల్ వేసి తుడుచుకుంటే చాలు.. మేకప్ క్లీన్ అయిపోతుంది.

ఇవి మాత్రమే కాదు.. తీవ్రమైన డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు స్నానం చేసిన వెంటనే ఒంటికి బేబీ ఆయిల్ అప్లై చేస్తే.. దురద తగ్గి, స్కిన్ రోజంతా సాఫ్ట్ గా ఉంటుంది. ముఖంపై ఏర్పడే టాన్, అలాగే కంటి కింద వచ్చే నల్లటి వలయాలను (Dark Circles) తొలగించడంలో కూడా బేబీ ఆయిల్ కి మించింది లేదు. రోజూ రాత్రి కంటి కింద లైట్ గా మసాజ్ చేసుకుంటే ఆ మార్కులు తగ్గిపోతాయి.మరో క్రేజీ టిప్ ఏంటంటే.. వ్యాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకున్న తర్వాత చర్మంపై మంట, రాషెస్ రాకుండా ఉండాలన్నా, స్ట్రెచ్ మార్క్స్ లైట్ గా అవ్వాలన్నా బేబీ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్.

Tags:    

Similar News