Don’t Like Drinking Milk: పాలు తాగడం ఇష్టం లేదా? అయితే ఎక్కువ కాల్షియం ఇచ్చే ఈ 7 ఆహారాల గురించి తెలుసుకోండి..

అయితే ఎక్కువ కాల్షియం ఇచ్చే ఈ 7 ఆహారాల గురించి తెలుసుకోండి..

Update: 2026-05-11 12:39 GMT

Don’t Like Drinking Milk: ఎముకలు బలంగా ఉండాలన్నా, దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కాల్షియం చాలా అవసరం. సాధారణంగా కాల్షియం అనగానే మనకు గుర్తొచ్చేది పాలు. కానీ చాలా మంది పాలు తాగడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారికి ప్రకృతిలో పాల కంటే ఎక్కువ కాల్షియం అందించే అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

కాల్షియం ఎందుకు ముఖ్యం?

మన శరీరంలోని 99శాతం కాల్షియం ఎముకలు, దంతాలలోనే ఉంటుంది. ఎముకల గట్టితనానికే కాకుండా గుండె పనితీరును క్రమబద్ధీకరించడానికి, కండరాల కదలికలకు, గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

పాలేతర కాల్షియం సూపర్ ఫుడ్స్ ఇవే:

చియా గింజలు:

ఇవి పోషకాల గనులు. కేవలం రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 179 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఇది ఒక గ్లాసు పాల కంటే ఎక్కువ కావడం విశేషం.

నువ్వులు:

100 గ్రాముల నువ్వులలో సుమారు 975 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి నువ్వులు అద్భుతమైన ఔషధం.

రాగి :

తృణధాన్యాలలో రాగికి ప్రత్యేక స్థానం ఉంది. 100 గ్రాముల రాగిలో 344 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అందుకే పిల్లలకు రాగి జావ పట్టడం చాలా మంచిది.

బాదం:

డ్రై ఫ్రూట్స్ లో బాదం కాల్షియానికి కేరాఫ్ అడ్రస్. ఒక కప్పు బాదంలో సుమారు 385 మి.గ్రా కాల్షియం లభిస్తుంది.

పాలకూర: ఆకుకూరల్లో పాలకూర బెస్ట్. ఒక కప్పు వండిన పాలకూర ద్వారా 275 మి.గ్రా కాల్షియం పొందవచ్చు.

సోయా ఉత్పత్తులు: పాలకు సమానమైన కాల్షియం సోయా పాలలో ఉంటుంది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్.

ఎండిన అత్తి పండ్లు : వీటిలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఎముకలతో పాటు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం:

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కాల్షియం ఉంటే సరిపోదు, ఆ కాల్షియం శరీరానికి అందాలంటే విటమిన్-డి కూడా అవసరం. కాబట్టి ప్రతిరోజూ కొద్దిసేపు ఎండలో ఉండటం కూడా అలవాటు చేసుకోండి.

Tags:    

Similar News