Seeds and Dry Fruits: ఈ 4 విత్తనాలు & డ్రై ఫ్రూట్స్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు!

అద్భుతమైన ప్రయోజనాలు!

Update: 2026-07-24 09:15 GMT

Seeds and Dry Fruits: మారిన మన జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. అయితే, రోజూ మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అందులో ముఖ్యమైనవే గింజలు, ఎండిన పళ్ళు

1. బాదం & వాల్‌నట్స్

"ముందుగా బాదం ,వాల్‌నట్స్ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజూ రాత్రి నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్-E మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక వాల్ నట్స్ బ్రెయిన్ షేప్‌లోనే ఉంటాయి... ఇవి మెదడు చురుగ్గా పనిచేయడానికి, అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే 'ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్' శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి."

2. ఫ్లాక్స్ సీడ్స్ & చియా సీడ్స్

ఇక విత్తనాల విషయానికి వస్తే... ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు), చియా సీడ్స్ మన ఆరోగ్యానికి ఒక నైజమైన సూపర్ ఫుడ్స్! బరువు తగ్గాలనుకునే వారికి చియా సీడ్స్ అద్భుతమైన వరప్రసాదం. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది, అలాగే ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, అలాగే హార్మోన్ల సమతుల్యతకు (Hormonal Balance) బాగా ఉపయోగపడతాయి.

3. గుమ్మడి, సూర్యకాంతి విత్తనాలు & ఎండుద్రాక్ష

వీటితో పాటు గుమ్మడి గింజలు (Pumpkin Seeds), సూర్యకాంతి గింజలు (Sunflower Seeds) తినడం వల్ల శరీరానికి కావలసిన జింక్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతాయి. రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షను (Raisins) ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తహీనత (Anemia) సమస్య తగ్గుతుంది, రక్తం బాగా పడుతుంది.

Tags:    

Similar News