Eating Indian Gooseberry Before Meals: భోజనానికి ముందు ఉసిరికాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

ఏం జరుగుతుందో తెలుసా.?

Update: 2026-06-17 04:19 GMT

Eating Indian Gooseberry Before Meals: మధుమేహం లేదా షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఉసిరికాయ ఒక అద్భుతమైన దివ్యౌషధంలా పనిచేస్తుందని మీకు తెలుసా? అవును.. భోజనానికి ముందు ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి ఎంతటి మేలు జరుగుతుందో ప్రముఖ ‘డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్’ జర్నల్‌లో ప్రచురించారు.

సాధారణంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా అకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. అయితే, భోజనానికి ముందు ఉసిరికాయను గనుక తింటే.. ఈ గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ కంట్రోల్ కోసం వైద్యులు సూచించే ‘ప్రీలోడింగ్ ఫుడ్స్’ లాగా.. ఈ ఉసిరికాయను మనం భోజనానికి ముందు హ్యాపీగా తీసుకోవచ్చు.

‘ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మల్టీడిసిప్లినరీ రీసెర్చ్’లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. ఉసిరిలో ఉండే ‘పాలిఫెనాల్స్’ శరీరంలో గ్లూకోజ్ జీవక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అయితే, ఉసిరికాయ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది కదా అని.. మోతాదుకు మించి ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక కేవలం షుగర్ కంట్రోల్ మాత్రమే కాదు.. ఉసిరికాయలో విటమిన్-సి కూడా కొండంత లభిస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో ఒక ఉసిరికాయను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తినే ఒక మీడియం సైజు ఉసిరికాయ ద్వారా శరీరానికి ఏకంగా 600 నుంచి 700 మిల్లీగ్రాముల విటమిన్-సి అందుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రోజూ భోజనానికి ముందు ఒక ఉసిరికాయ ముక్కను తినడం అలవాటు చేసుకోండి.

Tags:    

Similar News