Feeling Tired and Experiencing Mood Swings: అలసట, మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? కారణం ఇదే కావచ్చు..
కారణం ఇదే కావచ్చు..
Feeling Tired and Experiencing Mood Swings: ఈ రోజుల్లో చాలామంది చిన్నపనికే తీవ్రంగా అలసిపోవడం, తరచూ నీరసంగా అనిపించడం లేదా కారణం లేకుండానే మూడ్ మారిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటే. శరీరంలో విటమిన్-
డి స్థాయిలు పడిపోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి అత్యంత కీలకమైన ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం..
విటమిన్-డి లోపిస్తే కనిపించే ప్రధాన లక్షణాలు..
తీవ్రమైన అలసట, నీరసం:
రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోయినప్పటికీ, రోజంతా విపరీతమైన అలసట, శక్తి లేనట్లు అనిపించడం విటమిన్-డి లోపానికి ప్రధాన సంకేతం.
మూడ్ స్వింగ్స్ - డిప్రెషన్:
విటమిన్-డి మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది లోపిస్తే తరచూ చిరాకు రావడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.
కీళ్లు, ఎముకల నొప్పులు:
మన శరీరం క్యాల్షియాన్ని సరిగ్గా గ్రహించాలంటే విటమిన్-డి చాలా అవసరం. ఇది తగ్గితే ఎముకలు బలహీనపడి కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వేధిస్తాయి.
రోగనిరోధక శక్తి తగ్గడం:
తరచూ జలుబు, దగ్గు లేదా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారంటే మీలో రోగనిరోధక శక్తి క్షీణించిందని అర్థం. దీనికి విటమిన్-డి లోపం కూడా ఒక కారణం కావచ్చు.
లోపాన్ని అధిగమించడం ఎలా?
ఎండలో గడపడం:
విటమిన్-డి లభించే అత్యుత్తమ సహజ వనరు సూర్యరశ్మి. రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-డి అందుతుంది.
ఆహారపు అలవాట్లు: గుడ్డు సొన, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, చీజ్ మరియు ఫ్యాటీ ఫిష్ వంటి ఆహార పదార్థాలను మీ డైట్‌లో భాగం చేసుకోండి.
వైద్యుల సలహా: పైన పేర్కొన్న లక్షణాలు తీవ్రంగా ఉంటే, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని, వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లను వాడటం మంచిది.