Nature’s Summer Nectar: వేసవిలో అమృతం.. తాటి ముంజలు! తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే!
తాటి ముంజలు! తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే!
Nature’s Summer Nectar: ఎండలు మండిపోయే వేసవిలో మన దాహాన్ని తీర్చి, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ప్రకృతి ప్రసాదం.. తాటి ముంజలు. వీటిని ఇంగ్లీష్‌లో 'ఐస్ ఆపిల్' అని, తమిళంలో 'నుంగు' అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటాం. పైన ఉన్న గోధుమ రంగు తొక్కను తీస్తే.. లోపల తెల్లగా, మెత్తగా, జెల్లీలా కనిపించే ఈ ముంజలు చూడగానే నోరూరిస్తాయి. వీటి రుచి లేత కొబ్బరిలా తీపిగా ఉండటమే కాదు.. తినగానే నోట్లో ఇట్టే కరిగిపోతాయి.
అసలు ఈ ఐస్ ఆపిల్‌లో ఎన్ని పోషకాలో తెలుసా? విటమిన్ సి, కె, ఇ తో పాటు ఐరన్, కాల్షియం ఇందులో పుష్కలం. ఇందులో కేలరీలు తక్కువ, నీటి శాతం ఎక్కువ. అందుకే వడదెబ్బ తగలకుండా శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేయడంలో ఇది నెంబర్ వన్!
కేవలం చలువ చేయడమే కాదు.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని వదిలించడంలో తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా చేసి, మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ అద్భుతమైన పండును ఈ వేసవిలో అస్సలు మిస్ అవ్వకండి.!