Pomegranate: రోజుకో దానిమ్మ తింటే చాలు.. చర్మ సౌందర్యం, ఆరోగ్యం మీ గుప్పిట్లోనే!

చర్మ సౌందర్యం, ఆరోగ్యం మీ గుప్పిట్లోనే!

Update: 2026-06-19 06:19 GMT

Pomegranate: ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన పండ్లలో దానిమ్మ ఒకటి. ఎర్రగా మెరిసిపోయే ఆ గింజలను చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అయితే, దానిమ్మ కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక సంజీవని లాంటిది. ఈ పండు నిండా గింజలే కాదు, గింజ గింజలోనూ మన శరీరానికి అవసరమైన పోషకాలు పుల్లుగా ఉంటాయి. రోజూ ఒక దానిమ్మ పండు తిన్నా లేదా ఒక గ్లాసు రసం తాగినా కలిగే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటిగా... చర్మ సౌందర్యానికి దానిమ్మ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటువ్యాధులు, అలర్జీల వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే దానిమ్మను రోజూ తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై కంటికి కనిపించని ఒక అద్భుతమైన పొరను ఏర్పరుస్తాయి. ఇది పొడి చర్మం, వయసు మీద పడటం వల్ల వచ్చే మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలను చాలా త్వరగా నయం చేస్తుంది.ఇక ఇందులో శరీరానికి కావలసిన విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కేవలం ఒక కప్పు దానిమ్మ రసం తాగితే చాలు.. శరీరానికి 1.8 మిల్లీగ్రాముల విటమిన్-ఇ లభిస్తుంది.

అంతేకాదు, దానిమ్మను ‘జింక్ లోడెడ్’ ఫ్రూట్ అని కూడా అంటారు. మన శరీరంలో స్కిన్ సెల్స్ డెవలప్‌మెంట్‌లో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒక దానిమ్మ పండులో 1.1 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. అంటే ఒక మనిషికి రోజువారీగా అవసరమయ్యే జింక్‌లో 15 శాతాన్ని ఇది ఒక్కటే భర్తీ చేస్తుంది.దీనితో పాటు ఇందులో కాపర్ కూడా ఎక్కువే! ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తికి సహాయపడి.. కళ్లు, చర్మం,జుట్టును ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు దానిమ్మ రసం ద్వారా మన శరీరానికి ఏకంగా 500 మైక్రోగ్రాముల కాపర్ అందుతుంది.

Tags:    

Similar News