Persimmon Fruit Hits the Market: మార్కెట్లోకి పర్సిమన్ ఫ్రూట్..వీటిని తింటే అద్భుత ప్రయోజనాలు

వీటిని తింటే అద్భుత ప్రయోజనాలు

Update: 2026-05-11 07:52 GMT

Persimmon Fruit Hits the Market: యాపిల్ పండ్ల కాలం ముగిసిపోతోందా? భారతీయ పండ్ల మార్కెట్‌లోకి ఒక కొత్త 'సూపర్ ఫ్రూట్' వచ్చి చేరింది. అదే.. 'పర్సిమన్' (Persimmon). చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి రసవంతంగా ఉండే ఈ పండు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పుడు చైనాకే పరిమితమైన ఈ పండు, ఇప్పుడు మన దేశంలో అందరి ఫేవరెట్‌గా మారుతోంది. దీని రుచి , అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల అటు ప్రజలు, ఇటు రైతులు కూడా ఈ పండుపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో పర్సిమన్ సాగు ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వాతావరణ మార్పుల వల్ల యాపిల్ దిగుబడి తగ్గిపోతుంటే.. ఆ లోటును పర్సిమన్ భర్తీ చేస్తోంది. తక్కువ చలిలో కూడా పెరగడం, పురుగుమందుల అవసరం తక్కువగా ఉండటంతో రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు.

ఇక ఆరోగ్యం విషయానికి వస్తే.. పర్సిమన్‌ను మించిన పండు లేదనే చెప్పాలి. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. అందుకే భవిష్యత్తులో ఈ 'పర్సిమన్' పండు యాపిల్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News