Tea, Coffee or Soft Drinks: టీ, కాఫీ, కూల్ డ్రింక్స్.. వీటిలో దంతాలను ఎక్కువగా పాడు చేసేది ఏంటో తెలుసా?

ఏంటో తెలుసా?

Update: 2026-06-11 02:02 GMT

Tea, Coffee or Soft Drinks: చాయ్ అంటే ఇండియన్స్‌కు ఒక ఎమోషన్..! మన దేశంలో కోట్లాది మందికి ఉదయం కప్పు టీ పడనిదే రోజు గడవదు. కొందరైతే రోజుకు ఒక్కసారైనా చాయ్ తాగకపోతే అస్సలు బతకలేరు. అలాగే ఎండలో బయటకు వెళ్లినా, ఫ్రెండ్స్‌తో కలిసినా కూల్ డ్రింక్స్ తాగడం కూడా మనకు అలవాటే. అయితే.. మనం ఎంతో ఇష్టంగా తాగే ఈ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దంతాలకు మాత్రం పెద్ద ముప్పే పొంచి ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని అతిగా తాగడం వల్ల దంతాలు రంగు మారిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్.. ఈ మూడింటిలో ఏది పళ్ళను ఎక్కువగా పాడు చేస్తుందో తెలుసుకుందాం.

పూణేకు చెందిన ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ మూడు కూడా నోటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కానీ, అన్నింటికంటే దంతాలపై మొండి మరకలు ఏర్పడటానికి ప్రధాన కారణం 'బ్లాక్ టీ' మాత్రమేనట. అవును.. బ్లాక్ టీలో ఉండే టానిన్లు, రంగు సమ్మేళనాలు దంతాల ఎనామెల్‌కు చాలా సులభంగా అతుక్కుపోతాయి. దీనివల్ల కాలక్రమేణా దంతాలు పసుపు లేదా గోధుమ రంగులోకి మారిపోతాయి. దంతాల రంగు మారడానికి ఒక్క టీ మాత్రమే కాదు.. కాఫీ కూడా ఒక ప్రధాన కారణమే. కాఫీలో ఉండే ముదురు వర్ణద్రవ్యాలు పళ్ళపై ఉండే ఎనామెల్‌కు అంటుకుని.. క్రమంగా దంతాలు కాంతిహీనంగా మారేలా చేస్తాయి.

చాలా మంది కోలా లేదా ముదురు రంగులో ఉండే సాఫ్ట్ డ్రింక్స్ చూసి.. ఇవే పళ్ళను ఎక్కువగా పాడు చేస్తాయని అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇవి టీ లేదా కాఫీ అంతగా దంతాలపై మరకలను ఏర్పరచవట. కాకపోతే.. సాఫ్ట్ డ్రింక్స్‌లో ఉండే ఆమ్లాలు (యాసిడ్స్) దంతాల ఎనామెల్‌ను పూర్తిగా బలహీనపరిచి, క్షీణింపజేస్తాయి. ఒకసారి ఎనామెల్ దెబ్బతిన్నదంటే.. మనం ఏ ఇతర ఆహార పదార్థాలు తిన్నా ఆ మరకలు దంతాలకు మరింత సులభంగా అంటుకుంటాయి. పైగా కూల్ డ్రింక్స్‌లో ఉండే చక్కెర దంతక్షయానికి (పుచ్చిపోవడానికి) దారితీస్తుంది.

కాబట్టి.. టీ, కాఫీలతో దంతాలపై మరకలు పడితే.. కూల్ డ్రింక్స్ దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తాయి. అందుకే వీటిని పరిమితంగా తీసుకోవాలని, తాగిన వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News