Signs That Your Body May Be Lacking Protein: మీ బాడీలో ప్రోటీన్ తగ్గిందని చెప్పే సంకేతాలివే.!

ప్రోటీన్ తగ్గిందని చెప్పే సంకేతాలివే.!

Update: 2026-05-16 03:53 GMT

Signs That Your Body May Be Lacking Protein: ప్రోటీన్ అంటే కేవలం జిమ్‌కు వెళ్లేవారు తీసుకునే పదార్థం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు! మన శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా, జీవక్రియ సక్రమంగా జరగాలన్నా ప్రోటీన్ అత్యవసరం.మనం పప్పు, గుడ్లు, నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి ప్రోటీన్ సరిపోతుందని భావిస్తుంటాం. కానీ వాస్తవానికి మనం తీసుకునే దాంట్లో చాలా తక్కువ భాగం మాత్రమే శరీరానికి అందుతోంది. ముఖ్యంగా మహిళలు, శాఖాహారులు ,బరువు తగ్గాలనుకునే వారిలో ప్రోటీన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. మీ శరీరంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి,

1. తిన్న వెంటనే ఆకలేయడం:

మీరు భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? అయితే మీ ఆహారంలో ప్రోటీన్ తక్కువగా ఉందని అర్థం. ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి ప్రోటీన్ తక్కువగా ఉంటే.. గ్లూకోస్ లెవల్స్‌లో మార్పులు వచ్చి మీకు తరచుగా ఆకలి వేస్తుంటుంది.

2. జుట్టు, గోర్లు, చర్మ సమస్యలు

మన జుట్టు, గోర్లు 'కెరాటిన్' అనే ప్రోటీన్‌తో తయారవుతాయి. శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడినప్పుడు.. శరీరం దానిని జుట్టు, గోర్లకు కాకుండా ఇతర ముఖ్యమైన అవసరాలకు వినియోగించుకుంటుంది. దీనివల్ల జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడటం, చర్మం కాంతిహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

3. నిరంతరం అలసట:

అలసట అంటే కేవలం నిద్ర లేకపోవడమే కాదు.. కండరాల నొప్పి, ఎనర్జీ తక్కువగా ఉండటం కూడా ప్రోటీన్ లోపానికి సంకేతాలే. వ్యాయామం చేసిన తర్వాత కండరాలు కోలుకోవాలన్నా ప్రోటీన్ అవసరమే. కేలరీలు తగ్గిస్తున్నా కూడా శరీరంలో కొవ్వు తగ్గకపోవడానికి ప్రోటీన్ సరిగ్గా అందకపోవడమే ప్రధాన కారణం కావచ్చు.

4. తక్కువ రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి పెరగటం, ఆరోగ్యంగా ఉండటంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే యాంటీబాడీలు , రోగనిరోధక కణాలన నిర్మాణంలో ప్రోటీన్‌ ఉపయోగపడుతుంది.

5. అనారోగ్యానికి గురికావడం

ఎక్కువగా జలుబు చేయడం, గాయాలు వేగంగా తగ్గకపోవడం, పదేపదే వచ్చే ఇన్ఫెక్షన్లు రావడం, తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడంతో ముడిపడి ఉంటాయని చెబుతున్నారు. ఇదంతా పోషకార లోపం ఉన్నట్లుగా చెప్పవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.. రోగనిరోధక శక్తి క్రమక్రమంగా బలహీనపడవచ్చుని చెబుతున్నారు.

Tags:    

Similar News