Bay Leaves: బిర్యానీ ఆకును పక్కన పడేస్తున్నారా?.. ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!

ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు!

Update: 2026-07-03 14:49 GMT

Bay Leaves: బిర్యానీ అనగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన రుచి, నోరూరించే సువాసన. ఆ సువాసన వెనుక ఉన్న ముఖ్యమైన ఇంగ్రిడియంట్.. బిర్యానీ ఆకు! అయితే చాలామంది వడ్డించుకునేటప్పుడు ఈ ఆకును తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ, ఈ చిన్న ఆకులో దాగున్న హెల్త్ సీక్రెట్స్ తెలిస్తే.. ఇకపై దీన్ని అస్సలు పక్కన పడేయరు. అవును, బిర్యానీ ఆకు మన ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది!

మీకు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నాయా? అయితే బిర్యానీ ఆకు మీకు చక్కటి ఔషధం. వంటల్లో దీనిని వాడడం వల్ల లేదా దీనితో కాచుకున్న టీ తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది మన పొట్టలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి బిర్యానీ ఆకు చాలా మేలు చేస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అలాగే, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య.. స్ట్రెస్. బిర్యానీ ఆకులో ‘లైనాలూల్’ (Linalool) అనే ప్రత్యేక సమ్మేళనం ఉంటుంది. రూమ్‌లో ఒక బిర్యానీ ఆకును కాల్చి, ఆ పొగను పీల్చడం వల్ల లేదా బిర్యానీ ఆకు టీ తాగడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గి, హాయిగా నిద్ర పడుతుంది.

ఇందులో విటమిన్- ఎ, విటమిన్- సి లతో పాటు ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాదు, బిర్యానీ ఆకులు మరిగించిన నీటితో తల స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గి, జుట్టు సిల్కీగా మారుతుంది.

Tags:    

Similar News