Reduce Stress: ఒత్తిడిని తగ్గించి, మైండ్‌ను కూల్‌గా మార్చే టాప్ 5 సూపర్ ఫుడ్స్
టాప్ 5 సూపర్ ఫుడ్స్
Reduce Stress: ఆఫీసులో వర్క్ ప్రెజర్.. ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్.. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్! అవును.. ఈ రోజుల్లో చాలామందిని పీడిస్తున్న మానసిక శత్రువు స్ట్రెస్. ఈ ఒత్తిడి వల్ల మైండ్ బ్లాక్ అయిపోవడం, ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం లాంటివి కామన్ అయిపోయాయి. మరి ఈ స్ట్రెస్ నుండి బయటపడి, మైండ్‌ను ఐస్ ముక్కలా కూల్‌గా మార్చుకోవడం ఎలా?
ఒత్తిడి తగ్గాలంటే కేవలం రెస్ట్ తీసుకుంటే సరిపోదు.. మనం తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయాలి అంటున్నారు డాక్టర్లు. మన కిచెన్‌లోనే దొరికే కొన్ని 'సూపర్ ఫుడ్స్' ఒత్తిడిని మాయం చేస్తాయట. అవేంటో తెలుసుకుందాం.
నట్స్ అండ్ సీడ్స్ (బాదం, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు):
మీకు ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు గుప్పెడు బాదం లేదా వాల్‌నట్స్ తినండి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడును ప్రశాంతంగా ఉంచి, మూడ్‌ను క్షణాల్లో మార్చేస్తాయి.
డార్క్ చాక్లెట్:
చాక్లెట్ ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్! అవును, డార్క్ చాక్లెట్ తింటే శరీరంలో 'ఎండార్ఫిన్లు' అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ హార్మోన్‌ను తక్షణమే తగ్గిస్తుంది.
గ్రీన్ టీ లేదా చామంతి టీ (Chamomille Tea):
ఆఫీస్ వర్క్ మధ్యలో వచ్చే తలనొప్పికి కాఫీ కంటే ఒక కప్పు గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్. దీనిలోని ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం యాంగ్జైటీని తగ్గించి, మైండ్‌ను రిలాక్స్ చేస్తుంది.
అరటిపండ్లు,సిట్రస్ ఫ్రూట్స్:
అరటిపండులో ఉండే విటమిన్ బి6, పొటాషియం నరాలను ప్రశాంతపరుస్తాయి. అలాగే నారింజ, నిమ్మ లాంటి విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, బాడీ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
పెరుగు:
మన ఇంట్లో రోజూ ఉండే పెరుగు కేవలం చలవ చేయడానికే కాదు, మెంటల్ హెల్త్‌కు కూడా చాలా మంచిది. పెరుగులోని ప్రోబయోటిక్స్ పొట్టను క్లియర్ గా ఉంచి, మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్ పంపుతాయి.
ఒత్తిడి అనేది ఈ కాలంలో సహజం. కానీ, దాన్ని మన మైండ్ మీదకు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి రోజువారీ డైట్‌లో ఈ సూపర్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. ఎంత వర్క్ ఉన్నా సరే.. కాస్త టైమ్ మీ కోసం కేటాయించండి, ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. హెల్దీగా తినండి.. హ్యాపీగా ఉండండి!