Troubled by Morning Headaches: ఉదయాన్నే వచ్చే తలనొప్పితో విసిగిపోయారా? అయితే ఈ ఆవిరి చిట్కా మీ కోసమే
అయితే ఈ ఆవిరి చిట్కా మీ కోసమే
Troubled by Morning Headaches: తలనొప్పి.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. కానీ, ఉదయం కళ్లు తెరవడంతోనే తలనొప్పి మొదలైతే మాత్రం.. దాన్ని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే, రాత్రంతా మన శరీరానికి, మనస్సుకు పూర్తి విశ్రాంతి లభించిన తర్వాత ఉదయం చాలా ఫ్రెష్‌గా ఉండాలి. అలా కాకుండా తలనొప్పి వస్తోందంటే.. మీ శరీరానికి సరైన విశ్రాంతి దొరకడం లేదని అర్థం.
అసలు ఉదయాన్నే తలనొప్పి రావడానికి కారణాలేంటో తెలుసా? రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, అర్ధరాత్రి ఎక్కువసార్లు మెలకువ రావడం ప్రధాన కారణాలు కావచ్చు. అలాగే, కొందరికి బెడ్‌రూమ్‌లో వెలుతురు ఎక్కువగా ఉన్నా నిద్ర పట్టదు. ఇది కూడా తలనొప్పికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు.. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం, ఒత్తిడి, అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, అధికంగా మద్యం సేవించడం వల్ల కూడా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? వీలైనంత వరకు రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి 9 గంటలకల్లా బెడ్‌పైకి చేరితే శరీరానికి సరిపడా నిద్ర లభిస్తుంది. ఇవన్నీ పాటించినా తలనొప్పి తగ్గకపోతే.. ఒక అద్భుతమైన ఇంటి చిట్కా ఉంది. అదే ఆవిరి పట్టడం!
బాగా మరిగిన వేడి నీళ్లలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ (జిల్లేడు నూనె లేదా నీలగిరి తైలం) వేసి ఆవిరి పట్టండి. ఇది మీ మెదడు నరాలకు ఉపశమనాన్ని ఇచ్చి, తలనొప్పిని తక్షణమే తగ్గిస్తుంది.
అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆవిరి పట్టినా కూడా తలనొప్పి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఒకసారి డాక్టర్‌ను కలిసి చెకప్ చేయించుకోవడం ఎంతో మంచిది.