Brain Sharp for Life: లైఫ్ లాంగ్ మీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా? WHO చెబుతున్న సీక్రెట్స్ ఇవే..

WHO చెబుతున్న సీక్రెట్స్ ఇవే..

Update: 2026-07-03 14:54 GMT

Brain Sharp for Life: వయసు పెరుగుతున్న కొద్దీ కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మెదడు ఆరోగ్యం కూడా క్షీణించడం సహజం. ఈ రోజుల్లో చాలా మందిలో చిన్న వయసులోనే మతిమరుపు రావడం, ఏకాగ్రత లోపించడం, ఆలోచనా సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెదడును జీవితాంతం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కేవలం మందులు వాడితే సరిపోదని, మన దైనందిన అలవాట్లే కీలక పాత్ర పోషిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని కాపాడుకోవడానికి WHO సిఫార్సు చేసిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు ఇక్కడ ఉన్నాయి..

మెదడుకు పదును పెట్టే పనులు..

శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, మెదడుకు కూడా అంతటి శ్రమ అవసరం. రోజూ కొత్త విషయాలను నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, పజిల్స్ పూరించడం వంటి అలవాట్లు మెదడు కణాలను చురుగ్గా ఉంచుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతాయి.

క్రమం తప్పకుండా శారీరక శ్రమ..

శారీరక శ్రమ లేకపోవడం మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ లేదా యోగా చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరిగి, దాని సామర్థ్యం పెరుగుతుంది.

పౌష్టికాహారం - చెడు అలవాట్లకు దూరం..

మెదడు చురుగ్గా ఉండాలంటే పోషకాలతో కూడిన సమతలిత ఆహారం తీసుకోవాలి. ధూమపానం మెదడు నరాలను దెబ్బతీస్తుంది కాబట్టి దానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే మద్యపానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం చాలా మంచిది.

ఈ ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోండి..

WHO ప్రకారం, కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నేరుగా మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా:

అధిక రక్తపోటు

మధుమేహం

పెరిగిన కొలెస్ట్రాల్

అధిక బరువు

డిప్రెషన్

ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన మతిమరుపు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ వీటిని అదుపులో ఉంచుకోవాలి.

Tags:    

Similar News