మహాత్మాగాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

Mahatma Gandhi's great-granddaughter sentenced to seven years in prison

Update: 2025-06-16 03:31 GMT

మహాత్మాగాంధీ మునిమనమరాలికి చీటింగ్‌ కేసులో దక్షిణాఫ్రికాలో ఏడేళ్ళ జైలు శిక్ష పడింది. మహాత్మాగాంధీ మనుమలు గాంధీ, మేవా రామ్‌ గోబిన్‌ దంపతుల కుమార్తె లత రామ్‌ గోబిన్‌ దక్షిణాఃరికాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌.ఆర్‌ మహరాజ్‌ ని మోసగించినందుకు డర్బన్‌ కోర్టు లత రామ్‌ గోబిన్‌ కు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఎగుమతి, దిగుమతి వ్యాపారంలో నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌.ఆర్‌.మహరాజ్‌ ను 3.22 కోట్ల రూపాయలను మోసం చేరన్న ఆరోపణలు రుజవవ్వడంతో డర్బన్‌ కోర్టు 56 సంవత్సరాల లత రామ్‌ గోబిన్‌ కు ఏడు సంవత్సరాల కారాగార శిక్ష విధించిది. కనీసం లత రామ్‌ గోబిన్‌ అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వడానికి కూడా డర్బన్‌ కోర్టు నిరాకరించింది.

Tags:    

Similar News