Balochistan : బీఎల్‌ఏ దాడిలో 29 మంది పాక్‌ జవాన్లు మృతి

6నెలల్లో 286వ సారి దాడికి పాల్పడ్డ బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ;

Update: 2025-07-17 09:56 GMT

పాకిస్తాన్‌ ఆర్మీ జవాన్లపై బలోచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ మారోసారి దాడికి పాల్పడింది. తాజాగా గురువారం పాక్‌ ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై బీఎల్‌ఏ బాంబుల దాడి చేసింది. ఈ దాడిలో 29 మంది పాక్‌ జవాన్లను హతం చేసినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. తాము క్వెట్టా, జహు, కలాట్‌ ప్రాంతాల్లో ప్రాంతాల్లో దాడులకు పాల్పడినట్లు ఈ దాడుల్లో చాలా మంది గాయపడినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. గురు వారం పాక్‌ ఆర్మీ బస్సుపై ఐఈడీ బాంబులతో దాడులు చేశామని ఆ సమయంలో బస్సులో 48 మంది పాక్‌ సైనికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ వర్గాలు తెలియజేశాయి. ఇదిలా ఉండగా గచిన ఆరు నెలల్లో బీఎల్‌ఏ పాకిస్తాన్‌ ఆర్మీపై 286 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 700 మందికి పైగా పాక్‌ జవాన్లు హతమయ్యారు. పాక్‌ ఆర్మీపై ఈ దాడులు ఇంకా కొనసాగిస్తామని బీఎల్‌ఏ పేర్కొంది. బలూచిస్తాన్‌ కు స్వాతంత్ర్యం సిద్దించేంత వరకూ పాక్‌ సైన్యంపై దాడులు జరుగుతూనే ఉంటాయని బీఎల్‌ఏ స్పష్టం చేసింది.

Tags:    

Similar News