Israel Warns: గాజా మండిపోతోంది.. ఇజ్రాయెల్ హెచ్చరిక: ఖాళీ చేయకపోతే వెనక్కు తగ్గం

ఇజ్రాయెల్ హెచ్చరిక: ఖాళీ చేయకపోతే వెనక్కు తగ్గం

Update: 2025-09-16 06:59 GMT

Israel Warns: గాజా మరోసారి భారీ బాంబు దాడులతో దద్దరిల్లిపోతోంది. పాలస్తీనా ప్రత్యేక దేశ ఏర్పాటుకు ఐక్యరాజ్య సమితి (UNO) తీర్మానంపై ఆగ్రహంతో ఉన్న ఇజ్రాయెల్, గాజాపై భీకర దాడులకు దిగింది. సోమవారం (సెప్టెంబర్ 15) నుంచి భారీ బాంబులతో గాజాను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టింది. ఈ దాడుల్లో పెద్ద పెద్ద భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి.

ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్జ్ మంగళవారం (సెప్టెంబర్ 16) హెచ్చరిక జారీ చేస్తూ, "హమాస్ లొంగిపోవాలి, బంధీలను విడుదల చేయాలి, గాజాను ఖాళీ చేయాలి. లేకపోతే మరింత తీవ్రంగా దాడులు చేసి, గాజాను పూర్తిగా నాశనం చేస్తాం" అని ప్రకటించారు. సామాన్య ప్రజలు వెంటనే గాజాను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే గాజాలోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. చాలా మంది సామాన్యులు యుద్ధం నుంచి తప్పించుకునేందుకు కట్టుబట్టలతో గాజాను వదిలి వెళ్లిపోయారు. అయినప్పటికీ, యుద్ధం ముగిసే ఆశతో కొందరు అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం దాడులు మరింత ముమ్మరం కావడంతో, మరికొందరు రాత్రికి రాత్రే పారిపోయారు. గాజాను పూర్తిగా తగలబెట్టేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగింది.

Tags:    

Similar News