India Takes a Clear Stand on Ukraine War: మోదీ-పుతిన్ టాక్స్ హైలైట్.. “తటస్థం కాదు.. శాంతి పక్షమే భారత్ స్టాండ్” – ఉక్రెయిన్ యుద్ధంపై స్పష్టమైన సందేశం!

ఉక్రెయిన్ యుద్ధంపై స్పష్టమైన సందేశం!

Update: 2025-12-05 10:54 GMT

India Takes a Clear Stand on Ukraine War: భారత్ తటస్థంగా లేదని, శాంతి పక్షంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, రష్యా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గరి నుంచి రెండు దేశాలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు. పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి, ప్రతి విషయాన్ని వెల్లడించిందని మోదీ పేర్కొన్నారు.

భారత్-రష్యా మధ్య చర్చలు, శాంతియుత వివాద పరిష్కారాలపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య నమ్మకం గొప్ప బలమని, దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని మోదీ చెప్పారు. ఇరువురు కలిసి ప్రపంచాన్ని ఆ మార్గంలో నడిపిద్దామని వ్యాఖ్యానించారు. ఇటీవలి ప్రయత్నాలతో ప్రపంచం మరోసారి శాంతి దిశగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిరకాల స్నేహం పుతిన్ వ్యూహాత్మక విజన్‌ను ప్రతిబింబిస్తోందన్నారు.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడారు. భారత్, ప్రధాని మోదీ నుంచి లభించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల బంధం దశాబ్దాల క్రితమే పెరిగిందని అన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను భారత్‌తో షేర్ చేసుకున్నామని పుతిన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News