Russian President Vladimir Putin: గ్రీన్‌లాండ్ వ్యవహారం మా విషయం కాదు.. అది అమెరికాకు చెందిన సమస్య: పుతిన్ స్పష్టం

అది అమెరికాకు చెందిన సమస్య: పుతిన్ స్పష్టం

Update: 2026-01-22 04:30 GMT

ట్రంప్ ఆరోపణలకు రష్యా అధ్యక్షుడు నుంచి ఎదురుదెబ్బ.. అలస్కా ఒప్పందం గుర్తుచేసిన పుతిన్


Russian President Vladimir Putin: గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా స్పందించారు. గ్రీన్‌లాండ్ భద్రతకు రష్యా, చైనా నుంచి ముప్పు ఉందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

రష్యాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్.. ‘‘గ్రీన్‌లాండ్ వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా అమెరికా, డెన్మార్క్‌ల మధ్య సమస్య. వారు కలిసి పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ను తన భూభాగంగానే కాకుండా, సమాన హక్కులు కలిగిన ప్రాంతంగా గౌరవిస్తోందని, వివక్ష చూపడం లేదని కొనియాడారు. అయితే ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో అమెరికాకు సుదీర్ఘ చరిత్ర ఉందని ఎత్తిచూపారు. ‘‘గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు 1 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని భరించే శక్తి అమెరికాకు ఉంది’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా 1867లో రష్యా అలస్కాను కేవలం 7.2 మిలియన్ డాలర్లకు అమెరికాకు అమ్మిన విషయాన్ని పుతిన్ గుర్తుచేశారు.

గాజా శాంతి మండలిపై కూడా పుతిన్ మాట్లాడారు. ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు తాను అంగీకరించానని ట్రంప్ ప్రకటించగా.. ఆ ప్రతిపాదనను ఇంకా పరిశీలిస్తున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వాములతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు.

Tags:    

Similar News