United Nations Secretary-General António Guterres: భద్రతా మండలి సంస్కరణలకు బలమైన దేశాలు చొరవ చూపాలి: గుటెరస్

బలమైన దేశాలు చొరవ చూపాలి: గుటెరస్

Update: 2026-01-17 13:39 GMT

United Nations Secretary-General António Guterres: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ప్రపంచ భద్రతా మండలిని సంస్కరించడానికి శక్తివంతమైన దేశాలు ముందుకు వచ్చి చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా అంతర్జాతీయ వ్యవస్థలను మార్చాలని, 1945లో ఏర్పాటైన వేదికలు 2026 సమస్యలకు సరిపోవని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక అధికారాలకు అంటిపెట్టుకునే దేశాలు భవిష్యత్తులో పశ్చాత్తాపపడతాయని హెచ్చరించారు.

గుటెరస్ మాట్లాడుతూ, ప్రపంచ వాస్తవికతలకు అనుగుణంగా సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల స్థూల దేశీయోత్పత్తి వాటా క్షీణిస్తుండగా, వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడుతున్నాయని పేర్కొన్నారు. దక్షిణార్ధగోళ దేశాల మధ్య వాణిజ్యం ఉత్తరార్ధగోళ దేశాల వాణిజ్యాన్ని మించిపోతోందని వివరించారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ నిబంధనల్లో తమకు అనుకూలమైనవి మాత్రమే పాటిస్తూ, మిగిలినవి ఉల్లంఘిస్తున్నాయని, ఇది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరం తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ప్రతి రోజును ఫలవంతం చేసేందుకు కృషి చేస్తానని గుటెరస్ తెలిపారు. ప్రపంచంలో వివాదాలు, అసమానతలు, అనిశ్చితి పెరిగిపోతున్నాయని, ఎవరూ తమను ఏమీ చేయలేరన్న భావన ప్రబలంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2026 డిసెంబరు 31తో గుటెరస్ పదవీకాలం ముగియనుంది.

Tags:    

Similar News