Shocking Revelations from Elon Musk: ఎలాన్ మస్క్ షాకింగ్ ఒప్పుకోలు.. నా భాగస్వామికి భారతీయ మూలాలు.. కుమారుడి పేరు “శేఖర్”!
కుమారుడి పేరు “శేఖర్”!
Shocking Revelations from Elon Musk: ప్రపంచ ప్రసిద్ధ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన కుటుంబ రహస్యాలను బహిర్గతం చేశారు. తన సహజీవన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని, ఆమె చిన్నప్పుడు దత్తత తీసుకున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడి పేరులో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం 'శేఖర్' అనే పదాన్ని చేర్చుకున్నానని తెలిపారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన 'WTF is?' పాడ్‌కాస్ట్‌లో మస్క్ తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడారు.
"మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ నా సహజీవన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె చిన్న వయసులో దత్తత తీసుకున్నారు మరియు కెనడాలో పెరిగింది. అంతేకాకుండా, భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు గౌరవార్థంగా నా కుమారుడి పేరులో 'శేఖర్' అనే పదాన్ని చేర్చాను" అని మస్క్ స్పష్టం చేశారు.
యేల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన శివోన్, 2017లో మస్క్ ఆధ్వర్యంలోని న్యూరాలింక్ ప్రాజెక్టులో చేరారు. ఈ ప్రాజెక్టు మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చి మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక కార్యక్రమం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థలో డైరెక్టర్ పదవిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మస్క్-శివోన్‌కు నలుగురు సంతానం ఉన్నారు.
అదే పాడ్‌కాస్ట్‌లో మస్క్, అపార ప్రతిభాస్మత్వం కలిగిన భారతీయులను నియమించుకొని అమెరికా దశాబ్దాలుగా అనేక ప్రయోజనాలను పొందిందని కొనియాడారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలు, వీసా దుర్వినియోగం, స్థిర నివాసం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే సమయంలో మస్క్ వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణ సంతరించుకున్నాయి.