Tensions in Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు... భారతీయులకు హైకమిషన్ అడ్వైజరీ జారీ

భారతీయులకు హైకమిషన్ అడ్వైజరీ జారీ

Update: 2025-12-19 12:14 GMT

Tensions in Bangladesh: బంగ్లాదేశ్‌లో తిరిగి రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది మరణంతో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా, అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలోని భారత హైకమిషన్ భారతీయ పౌరులకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌లో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని హైకమిషన్ సూచించింది. అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్ల బయటకు రావద్దని హెచ్చరించింది. ఏదైనా అత్యవసర సాయం కావాల్సి వస్తే హైకమిషన్ లేదా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని సలహా ఇచ్చింది.

ఈ ఆందోళనలు బంగ్లాదేశ్‌లో రాజకీయ స్థిరత్వాన్ని మరింత ప్రభావితం చేస్తున్నాయి. భారత్‌తో సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దౌత్యవర్గాలు హితవు పలుకుతున్నాయి.

Tags:    

Similar News