Trump’s Attempt to Label Muslim Brotherhood as Terrorist: ముస్లిం బ్రదర్‌హుడ్‌పై ఉగ్ర ముద్రకు ట్రంప్ ప్రయత్నం… అరబ్ ప్రపంచంలో ఉద్రిక్తత!

అరబ్ ప్రపంచంలో ఉద్రిక్తత!

Update: 2025-11-25 10:52 GMT

Trump’s Attempt to Label Muslim Brotherhood as Terrorist: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ముస్లిం బ్రదర్‌హుడ్' సంస్థలపై భారీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థలను విదేశీ ఉగ్రవాద సంగటనలుగా గుర్తించి, వాటిపై కఠిన చర్యలు అమలు చేసేందుకు ప్రక్రియను ప్రారంభించారు. ట్రంప్ ఈ చర్యలతో అరబ్ ప్రపంచంలోని చారిత్రకమైన, అతి ప్రభావవంతమైన ఇస్లామిక్ ఉద్యమాన్ని ఆర్థిక, రాజకీయ ఆంక్షల గండిలో ఇరికట్టనున్నారు.

వైట్‌హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, లెబనాన్, ఈజిప్టు, జోర్డాన్ వంటి దేశాల్లోని ముస్లిం బ్రదర్‌హుడ్ అనుబంధ సంస్థలపై తక్షణ చర్యలు సూచించే నివేదిక సమర్పించాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా, దీనికి సంబంధించిన అధ్యక్షుల అధికారాలపై ఇప్పటికే ట్రంప్ సంతకాలు పూర్తి చేశారు. నివేదిక అందిన 45 రోజుల్లోపు ఈ సంస్థలపై ఉగ్ర ముద్ర వేసేందుకు మంత్రులు త్వరగతి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ సంస్థలు ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలపై హింసాత్మక దాడులకు మద్దతు, ప్రోత్సాహం అందిస్తున్నాయని ట్రంప్ పరిపాలన ఆరోపించింది. ముఖ్యంగా, హమాస్ వంటి మిలిటెంట్ సమూహాలకు వాటి మద్దతుగా ఉన్నట్లు ఆరోపణలు చేశారు. 'ముస్లిం బ్రదర్‌హుడ్ నెట్‌వర్క్‌పై ఈ చర్యలు అమెరికా, మిత్ర దేశాల ప్రయోజనాలను రక్షిస్తాయి. పశ్చిమాసియాలో ఉగ్రవాదం, అస్థిరతకు ఇది తీవ్రమైన దెబ్బ తీస్తుంది' అని ఫ్యాక్ట్ షీట్‌లో పేర్కొన్నారు.

ట్రంప్ పరిపాలన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడానికి దృఢంగా ముందుకు సాగుతోందని విదేశాంగ కార్యదర్శి రూబియో చెప్పారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలోనే ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇటీవల టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కూడా ఈ సంస్థపై రాష్ట్ర స్థాయి చర్యలు ప్రవేశపెట్టారు. 1920లలో ఈజిప్టులో స్థాపించబడిన ముస్లిం బ్రదర్‌హుడ్, ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకుని అరబ్ దేశాల్లో వేగంగా వ్యాపించింది. రహస్యపరమైన కార్యకలాపాలతో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ ఇప్పుడు అమెరికా దృష్టికి గురైంది.

Tags:    

Similar News