US President Donald Trump: నోబెల్ తిరస్కరించటం పై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం, ఇక అమెరికా ప్రయోజనాలే ముఖ్యం

ఇక అమెరికా ప్రయోజనాలే ముఖ్యం

Update: 2026-01-20 06:01 GMT

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన సంచలన వ్యాఖ్యలతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకపోవడంపై తీవ్రంగా తప్పుబట్టారు. "నేను ఎనిమిది యుద్ధాలకు పైగా ఆపాను, అయినా తిరస్కరించారు. ఇక శాంతి గురించి ఆలోచించను, అమెరికా ప్రయోజనాలకే దృష్టి పెడతాను" అంటూ నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్‌కు ఫోన్‌లో స్పష్టమైన సందేశం ఇచ్చారు.

గ్రీన్‌లాండ్ ద్వీప అంశాన్ని నోబెల్ పురస్కారంతో ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా వేరు విషయమని ట్రంప్ స్పష్టం చేశారు. డెన్మార్క్ యాజమాన్య హక్కులను ప్రశ్నిస్తూ, "ఆ ద్వీపం మీద వారికి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవు. వందల సంవత్సరాల క్రితం మా పడవ ఒకటి అక్కడికి వెళ్లిందని చెబుతున్నారు. కానీ మా పడవలు చాలా వచ్చాయి!" అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు.

చైనా, రష్యా వంటి దేశాలు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించాలని కుట్రలు పన్నుతున్నాయని హెచ్చరించారు ట్రంప్. "డెన్మార్క్‌కు ఆ ద్వీపాన్ని రక్షించే శక్తి లేదు. ప్రపంచ శాంతి కోసం గ్రీన్‌లాండ్ పూర్తి నియంత్రణ అమెరికా చేతిలో ఉండాలి" అని డిమాండ్ చేశారు. నాటో సంస్థ కోసం తాను చాలా చేశానని, ఇప్పుడు అమెరికా ప్రయోజనాల కోసం నాటో దృష్టి పెట్టాలని కూడా సూచించారు.

ఈ సందేశానికి స్పందించిన నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్, "నోబెల్ శాంతి బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు. స్వతంత్ర కమిటీ ఎంపిక చేస్తుంది" అంటూ వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త చర్చను రేకెత్తించాయి. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా భవిష్యత్ చర్యలు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News