నీట్ టాప్ ర్యాంకర్ల అవగాహన లోపం

సీట్లు కోల్పోతున్న తక్కువ మార్కుల అభ్యర్థులు;

Update: 2025-07-16 09:50 GMT

నీట్ 2025 పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో తెలంగాణ రాష్ట్ర తక్కువ మార్కుల అభ్యర్థులు చాలావరకు నష్టపోతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో తెలంగాణ అభ్యర్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. వీరిలో రిజర్వేషన్లకు సంబంధం లేకుండా చాలామందికి 450 పైన మార్కులు వచ్చాయి. ఈ అభ్యర్థులందరూ ఆల్ ఇండియా కౌన్సిల్లో సీట్లు పొందే అవకాశం ఉన్నకూడా. స్టేట్ కౌన్సిలింగ్ లోనే పాల్గొని టాప్ మెడికల్ కాలేజీ లలో సీట్లు పొందుతున్నారు. దీనితో నీట్ పరీక్షలో 450 కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రాష్ట్రంలోని కాలేజీలలో సీట్లు పొందే అవకాశం కోల్పోతున్నారు. వాస్తవానికి ఆల్ ఇండియా కోటా ప్రతీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీలలో 15% సీట్లు కేటాయిస్తారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన టాప్ యాంకర్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో వారి రాష్ట్రాలలో ప్రాధాన్యత ప్రాతిపదికన దరఖాస్తు చేసుకుంటే వీళ్ళు వాళ్ల రాష్ట్రంలోనే మంచి కాలేజీ లలో సీట్లు పొందవచ్చు. కానీ అవగాహన లోపంతో తెలంగాణ రాష్ట్రంలోని టాప్ ర్యాంకర్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లలో దరఖాస్తు చేయకుండా రాష్ట్ర కౌన్సిలింగ్ లోనే దరఖాస్తు చేస్తున్నారు.దీనితో ఆల్ ఇండియా కోటాలోని 15% సీట్లు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పొందుతున్నారు.తెలంగాణ రాష్ట్రం లో 35 ప్రభుత్వ మెడికల్ కళాశాల లు ఉన్నాయి. రాష్ట్ర టాప్ ర్యాంకర్లు రాష్ట్ర కోటాలో 85% లో దరఖాస్తు చేయడంవల్ల 450 కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కి రాష్ట్ర కోటాలో సీట్లు పొందలేకపోతున్నారు.

ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లు ఆల్ ఇండియా కోటాలో దరఖాస్తు చేసుకుంటే AIIMS, JIPMER మరియు మన రాష్ట్రంలోని మంచి ప్రభుత్వ కాలేజిలలో నే వారికి సీట్లు వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల ఈ టాప్ ర్యాంకర్లు తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల భవిష్యత్తు పరిగణలోకి తీసుకొని ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో దరఖాస్తు చేసుకొని.బోటబోటిగా మార్కులు వచ్చిన అభ్యర్థులకు రాష్ట్ర కోటాలో సీట్లు పొందే అవకాశాన్ని కల్పించవచ్చు ఇది తక్కువ మార్కులు సాధించిన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ఎంతో ఊరట నిచ్చి న్యాయం జరిగే విషయమని చెప్పవచ్చు...

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ అభ్యర్థులకు కూడా ఇదే సమస్య ఎదురవుతున్నది టాప్ ర్యాంకులు సాధించిన మైనార్టీ అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీలలో దరఖాస్తు చేయకుండా రాజధాని హైదరాబాద్ నగరంలోని మైనార్టీ కళాశాలలో సీట్లు పొందడంతో తక్కువ మార్కులు వచ్చినా మైనార్టీ అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు దీనితో మైనార్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతున్నది.

Tags:    

Similar News