మారన్‌ కుటుంబంలో విభేదాలు

సన్‌ నెట్‌ వర్క్‌ వాటాల్లో దయానిధి, కళానిధి మారన్ల మధ్య స్పర్దలు;

Update: 2025-06-20 05:47 GMT

భారతదేశంలోనే అతిపెద్ద మీడియా నెట్‌ వర్క్‌ లలో ఒకటైనా సన్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌ యజమానుల మధ్య కుటుంబ వివాదాలు తలెత్తాయి. తమళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మేనల్లుడు మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్‌ కుమారుల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. మాజీ కేంద్ర మంత్రి డీఎంకే పార్లమెంట్‌ సభ్యుడు దయానిధి మారన్‌ తన బిలియనీర్‌ సోదరుడు, సన్‌ మీడియా సంస్ధల చైర్మన్‌ కళానిధి మారన్‌ కు లీగల్‌ నోటీసులు పంపారు. జూన్‌ 10వ తేదీనే కళానిధి మారన్‌ తో పాటు ఆయన సతీమణి కావేరిలతో సహా ఏడు మందికి ఈ లీగల్‌ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. సన్‌ మీడియా నెట్‌వర్క్‌ అన్నదమ్ముల మధ్య నోటీసుల వ్యవహరాం వెలుగు చూడటంతో తమిళ రాజకీయ వ్యాపార వర్గాల్లో ఈ అంశం పద్ద చర్చనీయాంశం అయ్యింది. చెన్నైకి చెందిన సన్‌ మీడియా సంస్ధల చైర్మన్‌ కళానిధి మారన్‌ మోసం, మనీలాండరింగ్‌ లతో సహా అనేక మోసపూరిత వ్యవహరాలకు పాల్పడ్డారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ ఆరోపిస్తున్నారు. తమ తండ్రి కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్‌, తమిళనాడు మాజీ సీయం దివంగత కరుణానిధి సతీమణి ఎంకెదయాళుల భాగస్వామ్యంలో 2003లో స్ధాపించిన సన్‌ నెట్‌ వర్క్‌ కంపెనీ వాటాలను పునరుద్దరించాలని దయానిధి మారన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. సన్‌ టీవీ చైర్మన్‌ కళానిధిమారన్‌ తో పాటు ఏడుగురికి ఇచ్చిన లీగల్‌ నోటీసుల్లో సివిల్‌, క్రిమినల్‌, రెగ్యులేటరీ, ఎన్ఫోర్స్‌ మెంట్‌ చర్యలు తీసుకుంటామని దయానిధి మారన్‌ హెచ్చరించారు. దీనికన్నా ముందు గత సంవత్సరం అక్టోబర్‌ లో మొదటి సారి సోదరుడు కళానిధిమారన్‌ కు డీఎంకే ఎంపీ దయానిది మారన్‌ లీగల్‌ నోటీసులు పంపారు.

Tags:    

Similar News