Earthquake in Delhi : రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు

రిక్టర్‌ స్కేల్‌ పై 4.1గా నమోదు;

Update: 2025-07-10 08:33 GMT

దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం ఉదయం బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు నేషనల్ కేపిటల్‌ రీజియన్‌ అంతటా సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గురువారం ఉదయం 9.04 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనలు ఒక నిమిషం పాటు కొనసాగాయి. నేషనల్ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 4.1గా నమోదయ్యింది. హర్యానాలోని రోహతక్‌ జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే గురువారం సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం లేదు. అయితే ప్రకంపనలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఎత్తైన భవంతుల్లో నివసిస్తున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. తగిన భద్రతా చర్యలు పాటించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News