Chhattisgarh : మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని అరెస్ట్ చేసిన ఈడీ

మద్యం కుంభకోణం కేసులో భూపేంద్ర బాఘేల్ కుమారుడి అరెస్ట్;

Update: 2025-07-18 09:12 GMT

చత్తీస్ఘడ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘేల్‌ కు ఇన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్ ఇచ్చింది. చత్తీస్ఘడ్‌ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి మాజీ సీయం బాఘేల్‌ కుమారుడు చైతన్య బాఘేల్‌ ను ఈడీ అదికారులు అరెస్ట్‌ చేశారు. బాఘేల్‌ కుమారుడి అరెస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చత్తీస్ఘడ్‌ రాష్ట్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగి రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయ నష్టం జరిగిందని కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర బాఘేల్‌ కుమారుడు చైతన్య భాఘేల్‌ కీలక పాత్ర పోషించారని అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ చైతన్య బాఘేల్‌ రూ.2,160 కోట్ల ఈ మధ్యం కుంభకోణంలో ప్రధాన లబ్దిదారుడని ఆ కేసులో ఈడీ ఆరోపించింది. ఈకేసుకు సంబంధించి బాఘేల్‌ నివాసంలో గతంలో ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి బాఘేల్‌ నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. భిలాయ్‌ ప్రాంతంలోని బాఘేల్‌ నివాసం వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. అయితే ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీయం నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ సోదాల సమయంలో చైతన్య బాఘేల్‌ ఈడీకి సహకరించకపోవడంతో ఆయన్ను అరెస్ట్‌ చేసిన్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. విచిత్రం ఏంటంటే శుక్రవారం చైతన్య బాఘేల్‌ పుట్టన రోజు కావడంతో ఇదే రోజు ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం పట్ల అతని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన కుమారుడి అరెస్ట్‌పై భూపేంద్ర బాఘేల్‌ మాట్లాడుతూ తాము ఏ తప్పూ చేయలేదని, ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News