Faridabad Terror Module: ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్: మాస్టర్ మైండ్ ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్.. జైష్ ప్రభావంతో వైద్య విద్యార్థులకు రాడికలైజేషన్!

జైష్ ప్రభావంతో వైద్య విద్యార్థులకు రాడికలైజేషన్!

Update: 2025-11-12 10:27 GMT

Faridabad Terror Module: హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడిన ఉగ్రవాద కుట్రల వెనుక ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ చేతులు ఉన్నట్లు భద్రతా సంస్థలు వెల్లడి చేశాయి. ఈ టెర్రర్ మాడ్యూల్‌లో వైద్యులు, విద్యార్థులు చురుగ్గా ఉన్నారనే విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో అతని నేపథ్యం, కార్యకలాపాలపై కొత్త వివరాలు తెలిసిపోతున్నాయి.

ఇర్ఫాన్ అహ్మద్ షోపియాన్‌లోని  శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మాజీ పారామెడికల్ సిబ్బంది. అక్కడే వైద్య విద్యార్థులలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసి, వారిని రాడికలైజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొంది, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు JeM వీడియోలు చూపించి, ఆలోచనలను మార్చాడు. నౌగామ్ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించి, వారిని కుట్రల్లో చురుగ్గా చేశాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

అఫ్గానిస్థాన్‌లోని కొంతమందితో ఇంటర్నెట్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మాడ్యూల్‌లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్, ఉమర్ నబీలు కీలక పాత్ర పోషించారు. ఇర్ఫాన్ ఈ గ్యాంగ్‌ను రూపొందించి, నడిపించినట్లు దర్యాప్తులో తేలింది. దిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు (Delhi Blast)లో ఉమర్ పాల్గొన్నాడని, అతనికి ఇర్ఫాన్‌తో ప్రత్యక్ష లింకులు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. అలాగే, ఇటీవల అరెస్టయిన డాక్టర్ షాహిన్ ఈ కుట్రకు ఆర్థిక సహాయం అందించారని సమాచారం.

ఉగ్ర భావజాల ప్రచారం: వైద్యుల మధ్య వ్యాప్తి

ఇర్ఫాన్ ద్వారా రాడికలైజ్ అయిన వైద్య విద్యార్థులు, భద్రతా సంస్థలకు మరో సవాలుగా మారారు. ఫరీదాబాద్ ఆపరేషన్‌లో బయటపడిన ఈ మాడ్యూల్, దేశ రాజధాని దాడులకు మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది. JeM ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలు సిద్ధం చేసి, దిల్లీకి తరలించాలని ప్లాన్ చేశారని పోలీసులు వెల్లడి చేశారు. ఈ అరెస్టులతో మాడ్యూల్ బలహీనపడినా, మిగిలిన సభ్యులను పట్టుకోవడానికి దర్యాప్తు జోరుగా జరుగుతోంది.

ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ఉగ్రవాద భావజాలం విద్యార్థుల మధ్య వ్యాప్తి చెందకుండా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు పడుతున్నాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News