Madhya Pradesh CM Mohan Yadav: ఎయిర్ బెలూన్‌లో మంటలు.. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2025-09-13 13:25 GMT

Madhya Pradesh CM Mohan Yadav: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమైన హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మంద్‌సౌర్‌లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను తక్షణం అదుపు చేసి, సీఎం ఉన్న ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అధికారుల వివరణ

ఈ ఘటనపై మంద్‌సౌర్ జిల్లా కలెక్టర్ అదితి గార్గ్ వివరణ ఇచ్చారు. బెలూన్‌లో మంటలు వచ్చినట్లు వచ్చిన కథనాలు పూర్తిగా తప్పని, సీఎం బెలూన్‌ను పరిశీలించేందుకు మాత్రమే వచ్చారని, ఎక్కలేదని స్పష్టం చేశారు. బెలూన్‌ను లిఫ్ట్ చేసేందుకు గాలిని వేడి చేయడం సాధారణ ప్రక్రియ అని, ఇది భద్రతా ప్రమాణాలకు లోబడి జరుగుతుందని తెలిపారు. ఏడేళ్ల అనుభవం ఉన్న బెలూన్ పైలెట్ మహమ్మద్ ఇర్ఫాన్ కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. బెలూన్‌లో ఎల్పీజీ, ఫైర్‌ప్రూఫ్ కెవ్లార్ మెటీరియల్ వాడతామని, ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షితమని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News