టెహ్రాన్‌ నుంచి వెళ్లిపోండి – భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

Leave Tehran – Embassy warns Indians

Update: 2025-06-17 05:59 GMT

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్‌ నగరంలో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతోంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో టెహ్రాన్‌ కుదేలవుతోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న భారతీయుల భద్రత కోసం భారత ఎంబసీ అత్యవసర అడ్వైజరీ విడుదల చేసింది.



ఎంబసీ సూచనల ప్రకారం, టెహ్రాన్‌లో ఉన్న భారతీయులు తక్షణమే నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని వారు వెంటనే తమ ప్రస్తుత స్థానం, మొబైల్ నంబర్లను స్థానిక దౌత్యాధికారులకు తెలియజేయాలని సూచించింది.



ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన హెచ్చరికే ఈ పరిణామాలకు కారణమైంది. టెహ్రాన్‌ ఖాళీ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా మిలిటరీ యాక్షన్‌కు సూచికగా భావిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్‌ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తిరిగి వాషింగ్టన్‌కు చేరుకున్నారని అంటున్నారు. భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.



ఇక భారత్‌ కాకుండా చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా టెహ్రాన్‌లో ఉన్న తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బీజింగ్‌ కూడా ఇజ్రాయెల్‌లో ఉన్న చైనా పౌరులకు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది.



ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లో ఉన్న భారతీయులు ఎంబసీ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.




Tags:    

Similar News