Operation Sindhoor : ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఫోర్స్ లోనే ఉంది
ఢిల్లీలో జరిగిన ఓ డిఫెన్స్ సెమినార్ లో సీడీఎస్ అనిల్ చౌహన్ వ్యాఖ్య;
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ ప్రేరేతిప ఉగ్ర స్ధావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పటికీ ఫోర్స్ లోనే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ అవసరమైన సందర్భాల్లో జూలు విదల్చడానికి ఆపరేషన్ సింధూర్ సిద్దంగానే ఉందని ప్రకటించారు. ఈ సమావేశంలో భారత యుద్ద సామర్ధ్యం గురించి అనిల్ చౌహన్ అనేక విషయాలు చెప్పారు. యుద్ద సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలంటే ప్రతి నిమిషం, ప్రతి ఘడియ చాలా అవసరమని అన్నారు. అటు సస్త్రం ఇటు శాస్త్రాలు మిలటరీకి చాలా కీలకమైనవని తెలిపారు. యుద్దరంగంలోకి దిగుతున్న సైనికుడికి మూడు స్ధాయిల్లో ప్రావీణ్యత అవసరమని అనిల్ చౌహాన్ అన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, వ్యూహం, కార్యాచరణ అనేవి యుద్ద రంగంలో కీలక భూమిక పోషిస్తాయన్నారు. ఈ మూడింటిలో ప్రతి సైనికుడు ఆరితేరాలన్నారు. అధునాత సాంకేతిక పరిజ్క్షానాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు వెళితే యుద్దంలో విజయం సాధిస్తామని సీడీఎస్ అనిల్ చౌహన్ పేర్కొన్నారు.