Narendra Modi : అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోడీ

అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రెండొవ వ్యక్తిగా మోడీ;

Update: 2025-07-25 06:36 GMT

భారత దేశానికి అత్యధిక కాలం పని చేసిన రెండొవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అరుదైన రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తరువాత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన ఘనతను నరేంద్రమోడీ ఈ రోజు శుక్రవారంతో సాధించారు. ప్రధానిగా ఇందిరాగాంధీ మొత్తం 11 సంవ్సరాల17 రోజులు కాగా మోడీ నేటితో 11 సంవత్సరాల 18 రోజుల పాటు ప్రధానిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అంటే ఇందిరా గాంధీ 4,077 రోజులు ప్రధానిగా ఉండగా ప్రధాని మోడీ నేటి శుక్రవారంతో 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. 75 సంవత్సరాల రిటైర్మెంట్‌ కనుక పాటించకపోతే మోడీ పదవీ కాలం మరో నాలుగు సంవత్సరాలు కొనసాగుతుంది. మోడీ కన్నా ముందు ప్రధమ స్ధానంలో పండింట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ భారత దేశానికి అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా ఉన్నారు. నెహ్రూ స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి 1966వ సంవత్సరంలో ఆయన మృతి చెందే వరకూ దాదాపు 16 సంవత్సరాల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. రోజుల లెక్కన చూస్తూ నెహ్రై 6,130 రోజులు ప్రధానిగా ఉన్నారు. దీంతొ భారత్‌ కు సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా మోడీ ఘనత సాధించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జన్మించిన వ్యక్తిగా, హీందీ భాషేతర వ్యక్తిగా, కాంగ్రేసేతర వ్యక్తిగా ఇలా అనేక రకాల రికార్డులతో రెండు పర్యాయాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకుని మూడో దఫా కొనసాగుతున్న ఘనత కూడా మోడీ సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News