Air Chief Marshal A.P. Singh: గగనతల రక్షణకు ‘సుదర్శన చక్ర’.. భవిష్యత్ సవాళ్లకు సిద్ధం: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్!

భవిష్యత్ సవాళ్లకు సిద్ధం: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్!

Update: 2025-10-03 12:39 GMT

ఆపరేషన్ సిందూర్‌లో ఐఏఎఫ్ సత్తా ప్రపంచానికి తెలిసింది

ఘర్షణల పరిష్కారంలో భారత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.. త్రివిధ దళాల సమన్వయం కీలకం

2035 నాటికి కొత్త భద్రతా వ్యవస్థ అమలు: ప్రధాని సూచన

Air Chief Marshal A.P. Singh: భారత వాయుసేన (ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు రక్షణ రంగంలో స్వావలంబన కోసం ‘సుదర్శన చక్ర’ (సుదర్శన చక్ర మిషన్) అనే గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కవచంతో కీలక వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్బేధ్యంగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. త్రివిధ దళాలు (సైన్యం, నావికా, వాయు) ఇప్పటికే ఈ పనిని ప్రారంభించాయని తెలిపారు. ప్రధాని మోదీ సూచన మేరకు 2035 నాటికి ఈ కొత్త భద్రతా వ్యవస్థ పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన సత్తాను ప్రపంచం చూసిందని ఏపీ సింగ్ అన్నారు. ఇతర దేశాలతో ఘర్షణలు తలెత్తినపుడు వాటిని ఎదుర్కోవడం, పరిష్కరించడం విషయంలో భారత్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించి, అది సాధించగానే ఘర్షణను నిలిపివేయడం ద్వారా భారత్ తన సామర్థ్యాన్ని చాటిందని ఆయన వివరించారు. ప్రపంచ దేశాలు ఈ అంశాన్ని భారత్ నుంచి నేర్చుకోవాలని సూచించారు.

‘పాక్ కుట్రలకు టార్గెట్.. రాణ్ ఆఫ్ కచ్..!’

ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయంతో పాకిస్థాన్‌కు చెందిన 10 ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేశామని ఏపీ సింగ్ తెలిపారు. వాటిలో ఎఫ్-16లు కూడా ఉన్నాయని, పాక్ కుట్రలను అరికట్టడంలో రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్ బెదిరింపులకు సిద్ధంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News