Indigo Flight : ఢిల్లీ-గోవా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
ముంబయ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్;
సాంకేతిక లోపం తలెత్తడంతో న్యూఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానం ముంబయ్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానాన్ని ముంబయ్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసే ముందు పైలట్ ప్యాన్ ప్యాన్ ప్యాన్ అని మూడు సార్లు ఏటీసీకి సంకేతాలు పంపారు. విమానానికి ప్రాణాపాయం ఏమీ లేదు కానీ అనివార్య పరిస్ధితుల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుందని ఈ సంకేతాలకు సారాంశం. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి గోవా బయలుదేరిన ఇండిగో ఏ320 నియో ఎయిర్‌బస్సు గాలిలో ఉండగా ఒక ఇంజన్ ఖరాబయ్యింది. దీంతో పైల్ ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ మూడు సార్లు ఏటీసీకి సంకేతాలు పంపి ముంబయ్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. ఈ విషయంపై ఇండిగో సంస్ధ స్పందిస్తూ సాకేంతిక కారణం వల్ల విమానాన్ని అత్యవస ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.