Air India Flight : తిరువనంతపురం ఢిల్లీ ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు

విమానంలో ఎంపీలు... చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్;

Update: 2025-08-11 06:22 GMT
  • ల్యాండ్ అవుతున్న రన్ వే పై ఉన్న మరో విమానం
  • అదృష్టమే కాపాడింది ఎంపీలు, ప్రయాణికులు
  • గుండెలాగిపోయినంత పనైంది ఎక్స్‌ లో కేసివేణుగోపాల్

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిర్ ఇండియా 2455లో పార్లమెంట్ కు హాజరయ్యేందుకు ఎంపీలతో పాటు వందమందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తిరువనంతపురం నుంచి టేకాఫ్ కాగానే ఫ్లైట్ కు టర్బులెన్స్ ఎదురయ్యింది. ఆ టైంలోనే ప్రయాణికులంతా తీవ్రమైన టెన్షన్ కు గురయ్యారు. ఫైనల్ గా సిగ్నల్ సమస్య తలెత్తిందని ఫైలట్ అనౌన్స్ చేసి, విమానాన్ని చెన్నైకి తరలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చెన్నైలో ల్యాండింగ్ కోసం దాదాపు రెండు గంటల పాటూ ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. తీరా ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్క సారిగా మరో ప్రమాదం ఎదురైంది. ఎయిర్‌ ఇండియా 2455 విమానం ల్యాండ్ అవుతున్న అదే రన్ వే పై మరో విమానం ఉంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ అవుతున్న ఫ్లైట్ ను మళ్లీ టేకాఫ్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరో రన్ వే పై సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఈ తతంగం అంతా విమానంలో ఉన్న వాళ్ళకు భరించలేని టెన్షన్ పుట్టించింది. ఆ సమయంలో ప్రయాణికుల మానసిక పరిస్ధితి చెప్పలేని విధంగా ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టంతో పాటూ పైలట్ అప్రమత్తతే తమను కాపాడిందని ఎక్స్‌ సామాజిక మాధ్యమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ తమ చేదు అనుభవాల్ని పంచుకున్నారు. గెండె ఆగిపోయినంత పనైందని ఆయన తన ఎయిర్‌ ఇండియా విమన ప్రయాణ అనుభవాన్ని ఎక్స్‌లో వెల్లడించారు.

అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఇక ఫ్లైట్ గాల్లో ఉండగా ఏమాత్రం కుదుపులు వచ్చినా భయబ్రాంతులకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నిన్నరాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో ఉన్న ప్రయాణికులు ఎంత టెన్షన్ కు గురై ఉంటారో అర్దం చేసుకోవచ్చు. అయితే ఏఐ 2455 విమానం తిరువనంతపురం నుంచి ఢిల్లీ భయల్దేరిన విమాన ప్రయాణంలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని కాంగ్రేస్ నేత కేసి వేణుగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. విమాన ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News