Train hits school bus : తమిళనాడు కడలూరులో స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు

ముగ్గురు విద్యార్థులు మృతి... పలువురికి గాయాలు;

Update: 2025-07-08 05:29 GMT

తమిళనాడు రాష్ట్రం కడలూరులో పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢికొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో స్కూలు బస్సు తునాతునకలైపోయింది. ప్రమాదం జరిగిన తీవ్రతను చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కడలూరు పరిధిలోని చెమ్మన్‌ గుప్పం వద్ద స్కూలు బస్సు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో అటుగా వెళుతున్న రైలు ఢీ కొట్టింది. వాస్తవానికి అది లెవల్‌ క్రాసింగ్‌ అయినప్పటికీ రైలు వచ్చే సమచానికి రైల్వే గేటు వేయకపోవడంతో బస్సు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. రైలు వేగంగా ఢీ కొనడంతో స్కూలు బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. దీంతో బస్సు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. స్థానికలు అందించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటీన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి మృత దేహాలన పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News