Tamilandu Elections : టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా విజయ్
తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ;
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే సంవత్సరం జరగునున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే టీవీకే పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ పేరును శుక్రవారం ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా విజయ్ ని కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 206లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీవీకే కార్యవర్గం నిర్ణయించింది. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవని, ఈ ఎన్నికల్లో వేర్పాటు వాదులతో పొత్తు ఉండదంటూ టీవీకే కార్యవర్గం పలు కీలక తీర్మానాలు చేసింది. అలాగే వచ్చే నెలలో పార్టీ విస్తృత స్ధాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఎన్నికల వరకూ గ్రామ గ్రమాన బహిరంగ సభలు నిర్వహిచి విజయ్ ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకు వెళ్ళేందుకు కార్యచరణను రూపొందించి, ఈకార్యక్రమం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని టీవీకే ప్రణాళికలు రూపొందిస్తోంది.