రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన మరియు అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా సీఎం ఆదేశాను సారం వ్యవసాయ శాఖ వారు రైతు వారీ పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. ఒక వైపు పంటల కొనుగోళ్ళను చేపడ్తున్న ప్రభుత్వం, పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని, అట్టి నష్ట పరిహారాన్ని కూడా రైతుల ఎకౌంట్లలో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడమైనది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేయడమైనది. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇట్టి నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించడమైనది.

రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఏకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4753 ఎకరాలలు మరియు ఇతర పంటలు 477 ఎకరాలలో (ప్రాణహిత వరదల మూలంగా సంభందించిన నష్టం) పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసారు.

ఐతే మే నెలలో జరిగిన పంటనష్టానికి సంభందించి నివేదిక కూడా సిద్దంచేసి ఈ వారమే పంపగా, వాటికి సంబంధించిన నిధులు మంజూరు కావల్సి ఉన్నదని తెలియజేసారు.

Tags: