Spotlight on Divya Deshmukh: అందరి చూపు ఆమె పైనే..ఎవరీ దివ్య దేశ్‌ముఖ్

ఎవరీ దివ్య దేశ్‌ముఖ్;

Update: 2025-07-29 07:45 GMT

Spotlight on Divya Deshmukh:  ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది దివ్య దేశ్ ముఖ్. ఈ విజయం ఆమెకు గ్రాండ్ మాస్టర్ (GM) హోదాను తెచ్చిపెట్టింది. దీంతో అందరి దృష్టి ఆమె మీదే పడింది. ఆమె గురించి వివరాలను ఆరా దీస్తున్నారు.

కెరీర్

దివ్య దేశ్‌ముఖ్ 2005 డిసెంబర్ 9న నాగ్‌పూర్‌లో జన్మించిన ఒక భారతీయ చెస్ క్రీడాకారిణి .దివ్య దేశ్‌ముఖ్ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చింది. ఆమె చిన్న వయస్సు నుంచే చెస్ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తక్కువ సమయంలోనే అద్భుతమైన ప్రగతి సాధించింది. పదేళ్ల వయసులోనే జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన దివ్య, చదువును కూడా నిర్లక్ష్యం చేయకుండానే అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పాల్గొనేది. హోటల్ గదులలో, విమాన ప్రయాణాల్లో, ఆటల విరామ సమయంలో హోంవర్క్ పూర్తిచేసేది.

కెరీర్ లో కీలక విజయాలు

2012: అండర్-7 జాతీయ ఛాంపియన్‌షిప్ విజేత.

2014: అండర్-10 ప్రపంచ యూత్ టైటిల్ (డర్బన్).

2017: అండర్-12 ప్రపంచ యూత్ టైటిల్ (బ్రెజిల్).

2020: FIDE ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలు.

2021: మహిళా గ్రాండ్ మాస్టర్ (WGM) హోదా సాధించింది. విదర్భ నుంచిఈ హోదా పొందిన మొదటి మహిళ. భారతదేశంలో 22వ మహిళ.

2022: మహిళల భారత చెస్ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంది. అదే సంవత్సరం చెస్ ఒలింపియాడ్‌లో వ్యక్తిగత కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది.

2023: ఆసియా కాంటినెంటల్ మహిళల ఛాంపియన్‌షిప్ విజేత.

2024: ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత మహిళల జట్టులో కీలక సభ్యురాలు. లండన్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నంబర్ వన్ హౌయిఫాన్‌ను ఓడించింది.

2025: ఫిడే మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న మొదటి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఆమె గ్రాండ్ మాస్టర్ (GM) హోదాను కూడా దక్కించుకుంది .2026 మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించింది.

Tags:    

Similar News