Smriti Mandhana: స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం

మరో అరుదైన గౌరవం

Update: 2026-02-17 05:42 GMT

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2025 ఏడాదికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' (BBC ISWOTY) అవార్డు లభించింది. సోమవారం జరిగిన ఒక అట్టహాసమైన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు.

3మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది ఆమె కనబరిచిన అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో, వీడియో సందేశం ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు.

లెజెండరీ క్రీడాకారులు లియాండర్ పేస్, దీపా మాలిక్, అంజు బాబీ జార్జ్లతో కూడిన గ్రాండ్ జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా బీబీసీ న్యూస్ సీఈఓ జోనాథన్ మున్రో మాట్లాడుతూ, భారత మహిళా క్రీడాకారులు ప్రపంచ వేదికపై చూపుతున్న ప్రతిభ అసాధారణమని కొనియాడారు.

గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. భారత్ తరపున వన్డేల్లో (పురుషులు, మహిళలు కలిపి) ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ చేశారు. 29 ఏళ్ల మంధాన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రీడాకారిణిగా, అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన స్మృతి, తన తండ్రి, సోదరుడి స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేశారు.

Tags:    

Similar News