All-rounder Washington Sundar: న్యూజిలాండ్ తో చివరి రెండు వన్డేలకు వాషింగ్టన్ దూరం

చివరి రెండు వన్డేలకు వాషింగ్టన్ దూరం

Update: 2026-01-13 06:27 GMT

All-rounder Washington Sundar: పక్కటెముక గాయంతో టీమిండియా స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరగబోయే చివరి రెండు వన్డే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో అన్‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఆయుష్‌‌‌‌‌‌‌‌ బదోనీ సోమవారం జట్టులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆడిన సుందర్‌‌‌‌‌‌‌‌ ఐదు ఓవర్లు వేసి 27 రన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాడు. ఈ క్రమంలో పక్కటెముకలో తీవ్రమైన నొప్పి రావడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మధ్యలోనే వెళ్లిపోయాడు. తర్వాత ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చాడు. ‘బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నప్పుడు పక్కటెముకల కింద భాగంలో నొప్పి వస్తోందని సుందర్‌‌‌‌‌‌‌‌ చెప్పాడు. దాంతో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ నుంచి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌‌‌‌‌‌‌‌ తీయాల్సి ఉంది. ఆ తర్వాత బీసీసీఐ వైద్య బృందం చికిత్సను అందిస్తుంది. ప్రస్తుతానికి సుందర్‌‌‌‌‌‌‌‌ ప్లేస్​లో ఆయుష్‌‌‌‌‌‌‌‌ బదోనీని తీసుకున్నారు’ అని బీసీసీఐ పేర్కొంది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో 57.96 యావరేజ్‌‌‌‌‌‌‌‌ కలిగి ఉన్న బదోనీకి లిస్ట్‌‌‌‌‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మాత్రం మంచి రికార్డు లేదు. 27 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అతని యావరేజ్‌‌‌‌‌‌‌‌ 36.47గా ఉంది.

Tags:    

Similar News