Asia Cup 2025: ఆసియా కప్‌ 2025: ఆకట్టుకుంటున్న బీసీసీఐ స్పెషల్ వీడియో

బీసీసీఐ స్పెషల్ వీడియో

Update: 2025-09-10 18:30 GMT

 Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 టోర్నీలో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌లో యూఏఈని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఈసారీ కూడా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు సన్నద్ధతను చూపిస్తూ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ తో పాటు హార్దిక్‌ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ వంటి కీలక ఆటగాళ్లు సాధన చేస్తూ కనిపించారు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆసియా కప్ గెలుపే లక్ష్యం

టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఈ వీడియోలో తమ లక్ష్యాలను స్పష్టం చేశారు. "హలో వైట్‌ బాల్‌ క్రికెట్‌ ఫ్యాన్స్... మిమ్మల్ని థ్రిల్ చేయడానికి మేం మళ్లీ వచ్చేశాం. పూర్తిగా రీఛార్జ్‌ అయ్యాం, గర్జించేందుకు సిద్ధం. గతంలో ఇక్కడే ఛాంపియన్లుగా నిలిచాం. ఇప్పటికే ఆసియా కప్‌ను ఎనిమిది సార్లు గెలిచాం. తొమ్మిదోసారి కూడా విజయం అంత సులువు కాదని తెలుసు. ఏ ప్రత్యర్థినీ తేలిగ్గా తీసుకోం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా మా వారసత్వాన్ని కొనసాగిస్తాం. 'వరల్డ్'ను పరిగణనలోకి తీసుకొనే ముందు 'ఆసియా'తోనే ప్రారంభిస్తాం" అని ఆటగాళ్లు ఉద్ఘాటించారు.

గతంలో టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచినప్పుడు కూడా మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరిగాయి. ఆ టోర్నీ వన్డే ఫార్మాట్‌లో ఉండగా, ఇప్పుడు జరుగుతున్నది టీ20 ఫార్మాట్‌లో. 2023లో జరిగిన ఆసియా కప్‌ (వన్డే)ను కూడా భారతే గెలుచుకుంది.

Tags:    

Similar News